Begin typing your search above and press return to search.

స్టేషన్ లో హల్ చల్ చేస్తే లోపలే... రేవంత్ వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి గురించేనా?

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్.ఎం.డీ.ఏ. గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తు కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 1:30 AM GMT
స్టేషన్  లో హల్  చల్  చేస్తే లోపలే... రేవంత్  వ్యాఖ్యలు కౌశిక్  రెడ్డి గురించేనా?
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్.ఎం.డీ.ఏ. గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా జరుపుతున్న ప్రజా పాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖపై వరాల జల్లులు కురిపించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా... ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే.. పోలీసులు బాధితులతో ఫ్రెండ్లీగా ఉందాలి కానీ.. నేరస్తులు, కబ్జాదారులతో కాదని అన్నారు.

ఈ సందర్భంగా... సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసులే అని.. అత్యంత విమర్శలు ఎదుర్కొనేది పోలీసులే అని అన్నారు. అయితే... కొంతమంది పోలీసుల వల్ల అలాంటి చెడ్డ పేరు వస్తుందని.. పోలీసు శాఖపై ఉన్న చెడ్డ పెరును తొలగించుకోవాలని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా.. పోలీసులు ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదని అన్నారు.

ప్రోటోకాల్స్ ఎంతవరకూ పాటించాలో అంతే పాటించాలని సూచించారు. ఈ సమయంలో.. ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వచ్చి హడావిడి చేయాలని అనుకుంటే.. ముందు వారిని లోపల వేయండని.. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. దీంతో... ప్రధానంగా ఈ వ్యాఖ్యలు బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించే చేసి ఉంటారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తన ఫిర్యాదు సీఐ తీసుకోవడం లేదని.. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ కి వస్తే సీఐ రిసీవ్ చేసుకోవడం ప్రోటోకాల్ అంటూ కౌశిక్ రెడ్డి హడావిడి చేశారు! ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ మొదలైంది.

మరోపక్క హోంగార్డులకు సీఎం వరాల జల్లులు కురిపించారు! ఇందులొ భాగంగా... వారికి ఇస్తున్న రోజువారీ వేతనాన్ని రూ.1000 కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో వీక్లీ పరేడ్ అలవెన్స్ ను రు.200 కు పెంచుతున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో ఏదైనా ప్రమాదం జరిగి హోంగార్డ్ మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని పేర్కొన్నారు.

ఇదే సమయంలో... ఏదైనా ప్రమాదంలో మరణించిన ఐపీఎస్ అధికారి కుటుంబానికి రూ.2 కోట్లు.. డీఎస్పీ స్థాయి అధికారి కుటుంబానికి రూ.1.50 కోట్లు ఎక్స్ గ్రేషియా ఇస్తామని తెలిపారు. ఇక.. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని డ్ర