Begin typing your search above and press return to search.

సంక్రాంతికి స్వీట్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్

దీంతో.. ఇప్పటివరకు రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలని తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.

By:  Tupaki Desk   |   5 Jan 2025 5:15 AM GMT
సంక్రాంతికి స్వీట్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
X

సంక్రాంతిని పురస్కరించుకొని స్వీట్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏళ్లకు ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేసిన ప్రభుత్వాలకు భిన్నంగా.. తాము కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఎంతో కాలంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల్ని జారీ చేయటాన్ని నిలిపివేశారు. దీంతో.. ఇప్పటివరకు రేషన్ కార్డులు లేని వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలని తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ వెల్లడించారు.

సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఉంటుందని చెప్పటం ద్వారా.. ఇప్పటివరకు కార్డులు లేని వారికి మేలు చేస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డుల కారణంగా పేదలు.. ఆర్థికంగా వెనుకబడినవారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అమలుకు సాధ్యమవుతుంది. సంక్రాంతిని పురస్కరించుకొని ఇవ్వాలని డిసైడ్ చేసిన కొత్త రేషన్ కార్డుల్ని ఈ నెల 26 నుంచి జారీ చేయటం షురూ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

మొత్తంగా రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న వారికి ఊరట కలిగించేలా ముఖ్యమంత్రి రేవంత్ తాజా ప్రకటన ఉందని చెప్పాలి. కొత్త రేషన్ కార్డుల కోసం ఇపపటివరకు ఆన్ లైన్ లో మీ-సేవలో అప్లై చేయాల్సి వచ్చేది. ఇపపుడు ఆఫ్ లైన్ లోనూ దరఖాస్తులు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రామ సభలు..బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తుల్ని తీసుకుంటారు. వాటిని కంప్యూటర్ లో నమోదు చేసి.. ఈ నెల 26 నుంచి కార్డుల్నిజారీ చేస్తారు. అదే సమయంలో ఇప్పటికే కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారివి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయంచింది. పెళ్లైన తర్వాత అత్తారింట్లో తమ పేర్లను నమోదుచేయాలని కొందరు.. తమ పిల్లల పేర్లు నమోదు చేయాలని.. ఇలా దాదాపు12 లక్షలకు పైగా అప్లికేషన్లు ఉన్నాయి. వాటిని సైతం మార్చి.. కొత్తవి జారీ చేయాలని నిర్ణయించారు.

మంత్రిమండలి సమావేశంలో మరిన్ని నిర్ణయాల్ని తీసుకున్నారు. పంచాయితీ రాజ్ గ్రామీణాభివ్రద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలకు ఓకే చెప్పారు. పంచాయితీ రాజ్.. గ్రామీణాభివ్రద్ధి శాఖ పరిధిలోని జిల్లా పరిషత్ లు.. మండల పరిషత్ లలో పని చేసే 588 మంది సిబ్బంది అనారోగ్య సమస్యలతో పాటు ఇతర కారణాలతో మరణించారు. వారి కుటుంబాలకు చెందిన వారు ఉద్యోగాల కోసం కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆరేళ్లుగా కోరుతున్నారు. ఇందుకు సీఎం ఓకే చెప్పారు.

కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చేందుకు ములుగు పంచాయితీని మున్సిపాలిటీగా చేసేందుకుమంత్రి మండలి ఓకే చెప్పింది. 2022 సెప్టెంబరులోనే రాష్ట్ర అసెంబ్లీ ములుగును మున్సిపాలిటీగా మార్చిన బిల్లుకు ఓకే చెప్పినా.. గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీనిపై మంత్రి సీతక్క చొరవ తీసుకోగా.. బిల్లులోని లోపాల్ని రాజ్ భవన్ తెలపటంతో దాన్ని సవరించి కొత్త ప్రతిపాదనను మంత్రి మండలిలో సమర్పించగా.. అందుకు ఆమోదం తెలిపారు. దీంతో.. గవర్నర్ ఆమోదం కూడా త్వరలోనే పొందుతుందని పేర్కొన్నారు. ఇక.. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి.. వినియోగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన కీలక చర్చను తర్వాతి మంత్రిమండలిలో చేపట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.