Begin typing your search above and press return to search.

రేవంత్ తోపాటు ఎనిమిది మంది ప్రమాణం... అర్ధమా, అలకా..?

అవును... ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్స్ పార్టీ అధిష్టాణం నుంచి పిలుపువచ్చింది.

By:  Tupaki Desk   |   6 Dec 2023 11:31 AM GMT
రేవంత్  తోపాటు ఎనిమిది మంది ప్రమాణం...  అర్ధమా, అలకా..?
X

ఢిల్లీలో కీలక చర్చలు, మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన కీలక చేర్పులతోపాటు తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పెద్దలను పిలవడానికి హస్తిన వెళ్లిన రేవంత్ రెడ్డి... హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయలో హైదరాబాద్ కు బయలుదేరిన ఆయన తిరిగి అధిష్టానం పిలుపుమేరకు వెనక్కి వెళ్లారు. దీంతో ఢిల్లీలో ఏమి జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది

అవును... ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్స్ పార్టీ అధిష్టాణం నుంచి పిలుపువచ్చింది. ఎయిర్ పోర్ట్ నుంచి వెంటనే వెనక్కి రావాలని ఈ మేరకు పిలుపు రావడంతో ఆయన తిరిగి మహారాష్ట్ర సదన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాణిక్ రావ్ ఠాక్రేతో రేవంత్ రెడ్డి సమావేశమైనట్లు తెలుస్తుంది. దీంతో జరగకూడనిది ఏమైనా జరుగుతుందా అనే గందరగోళం తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైందని తెలుస్తుంది

మరోపక్క మంత్రివర్గ కూర్పు ఆల్ మోస్ట్ ఫైనల్ అయ్యిందని... తెలంగాణ రాష్ట్రంలో కాబోయే మంత్రుల పేర్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికోసమే రేవంత్ ను హైకమాండ్ వెనక్కి పిలిచిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎయిర్ పోర్ట్ నుంచి వెనక్కి వెళ్లిన రేవంత్ రెడ్డి... మహారాష్ట్ర సదన్ కు చేరుకున్నారు.

ఈ సమయంలో ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమంలో రేవంత్ తో పాటు కేవలం మరో ఎనిమిది మంది మాత్రమే ప్రమాణ స్వీకారాలు చేయొచ్చని తెలుస్తుంది. దీంతో... ఈ విషయం సమస్యగా మారే అవకాశంపైనా రేవంత్ తో చర్చిస్తున్నారా అనే చర్చ మొదలైంది. సుమారు 10ఏళ్ల తర్వాత తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో... ఇప్పుడు రేవంత్ తో పాటు మరో ఎనిమిది మంది మాత్రమే ప్రమాణస్వీకారాలు చేస్తారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ లో అసలే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ.. దీనికి తోడు 10మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అలిగితే ఏమైనా జరగొచ్చనే చర్చ మరోవైపు జరుగుతున్న నేపథ్యంలో... ఎనిమిది మంది మంత్రులను మాత్రమే ప్రకటించడం.. మిగిలినవారిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది! అయితే ఈ విషయంలో మిగిలిన ఆశావహులు అర్ధం చేసుకుంటారా.. అలుగుతారా అనేది వేచి చూడాలి!