బ్రేకింగ్... రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారంలో మార్పు!
అవును... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది.
By: Tupaki Desk | 6 Dec 2023 6:49 AM GMTతెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది.
అవును... తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో మార్పు జరిగింది. ముందుగా గురువారం ఉదయం 10:28 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించగా.. తాజాగా ఆ సమయాన్ని కాస్త మార్చారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ మారిన సమయాన్ని వెల్లడించాయి.
మరోవైపు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సమయంలో... తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన ఆహ్వానిస్తున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశమైన రేవంత్.. ఆ తర్వాత అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ ను కలిశారు.
ఇలా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించిన అనంతరం కేబినెట్ కూర్పు, ఇతర అంశాలపై వారితో చర్చించినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో సోనియా, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సుమారు 50 నిమిషాల పాటు వివిద అంశాలపై చర్చించారని తెలుస్తుంది!
ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలతో.. పోలీసు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు చర్చించారు.