పవన్ని పట్టుకుని రేవంత్ అలా అనేశారేంటి...?
జనసేన బీజేపీ పొత్తుల మీద జోకులే పేల్చుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే బీజేపీ పొత్తుల మీద చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 26 Oct 2023 5:36 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని సీరియస్ పొలిటీషియన్ గా సాటి రాజకీయ పక్షాలు భావించడం లేదా అంటే ఏపీలో ఏమో కానీ తెలంగాణాలో మాత్రం అదే సీన్ అని అంటున్నారు. జనసేన బీజేపీ పొత్తుల మీద జోకులే పేల్చుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే బీజేపీ పొత్తుల మీద చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. అయితే జనసేన మాత్రమే ఎందుకు ఏకంగా ప్రజా శాంతి పార్టీ అని ఒకటి ఉందిగా. కేఏ పాల్ తోనూ పొత్తులు కదిపితే చాలా బాగుంటుంది అని రేవంత్ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి.
రేవంత్ మరీ ఇంతలా పవన్ కళ్యాణ్ణి ఆయన పార్టీని తీసి పక్కన పడేశారా అని కూడా అంటున్నారు. కేఏ పాల్ కి పవన్ కి పోలిక పెట్టి ఇద్దరి స్థాయీ ఒక్కటే అని రేవంత్ చెప్పేసారా అని కూడా సెటైర్లు పడుతున్నాయి. నిజానికి చూస్తే కేఏ పాల్ తో పవన్ పార్టీని పోల్చినా కేఏ పాల్ ప్రజా శాంతి తరఫున మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేశారు. ఆయన తెలంగాణాలో తిరుగుతున్నారు. నేనూ ఉన్నాను అని అంటున్నారు.
అన్నింటికీ మించి నోరు చేసుకుని కేసీయార్ ప్రభుత్వాన్ని సందు దొరికినపుడల్లా ఘాటుగానే విమర్శిస్తున్నారు. అదే పవన్ అయితే తెలంగాణాలో తన పార్టీ ఉంది అన్నదే మరచిపోయారని అంటున్నారు. పైపెచ్చు ఆయన కేసీయార్ ని ఒక్క మాట కూడా అన్నది లేదని గుర్తు చేస్తున్నారు. ఇక పార్టీ మీటింగులు కూడా పెద్దగా పెట్టింది లేదని అంటున్నారు
కేఏ పాల్ కి మునుగోడులో ఎన్నో కొన్ని ఓట్లు వచ్చి ఉండాలి. కానీ జనసేన పెట్టిన దగ్గర నుంచి పోటీ చేయకుండా అసలు ఎన్ని ఓట్లు తెలంగాణాలో ఉన్నాయో కూడా తెలియకుండా ఉందని అంటున్నారు. అటువంటిది తెలంగాణాలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే జనసేన పార్టీ అని చూసి కాదు, పవన్ కళ్యాణ్ సినీ సెలిబ్రిటీ అని చూసి అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ గ్లామర్ ని సొమ్ము చేసుకుందామని బీజేపీ ఆలోచిస్తోంది. పైగా ఆంధ్రా సెటిలర్ల్స్ పవన్ సామాజికవర్గం బలం ఇవన్నీ కూడా ఎంతో కొంత తమకు హెల్ప్ అవుతాయని భావించి బీజేపీ పొత్తుకు రెడీ అయితే రేవంత్ పవన్ని కేఏ పాల్ ని కలిపి ఒకే గాటకు కట్టేశారు. అంతే కాదు పవన్ రాజకీయాన్ని లైట్ చేసి పారేశారు. దీని మీదనే ఇపుడు చర్చ సాగుతోంది. కేఏ పాల్ పవన్ రాజకీయంగా ఒక్కటేనా అన్నదే ఆ చర్చ.
మరి కేఏ పాల్ పవన్ ఒక్కటి కాదు అని నిరూపించాల్సింది తెలంగాణా ఎన్నికలే అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో కనుక జనసేన మంచి మొత్తంలో ఓట్లు తెచ్చుకున్నా లేక సీట్లు కొన్ని అయినా గెలిచినా అపుడు జనసేన గురించి అంతా ఆలోచించే సీన్ ఉంటుంది. మరి అది జరగాలంటే పవన్ సీరియస్ గానే తెలంగాణా పాలిటిక్స్ మీద ఫోకస్ పెట్టాలని అంటున్నారు.