కేటీఆర్ రూ.లక్ష సాయానికి రేవంత్ కౌంటర్ అదిరింది కదా?
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. ఇటీవల కేటీఆర్ ఒక నర్సింగ్ విద్యార్థికి రూ.లక్ష మొత్తాన్ని ఆర్థిక సాయంగా ఇవ్వటంపైన స్పందించారు.
By: Tupaki Desk | 28 Dec 2023 5:38 AM GMTకొన్ని పనులు చేసినప్పటికి దాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవటం చూస్తుంటాం. అలాంటి గొప్పలకు పోయిన మాజీ మంత్రి కేటీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. నిజానికి సాయం చేయటం తప్పేం కాదు. కానీ.. చేసేసాయాన్ని రాజకీయ కోణంగా మార్చేయటం.. తాము సాయంగా ఇచ్చిన రూ.లక్షకు రూ.కోటి మందంగా మైలేజీ రావాలనుకోవటంతోనే అసలు సమస్య అంతా. ఇలాంటి తీరునే ప్రదర్శించిన మాజీమంత్రి కేటీఆర్ కు మళ్లీ నోట మాట రాలేని రీతిలో పంచ్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. అంతేకాదు.. రాబోయే రోజుల్లో సాయం చేసినా.. దాని గురించి తమకు తాముగా చెప్పుకోవటానికి వెనకాడలేలా ఆయన మాటలు ఉండటం గమనార్హం.
తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్.. ఇటీవల కేటీఆర్ ఒక నర్సింగ్ విద్యార్థికి రూ.లక్ష మొత్తాన్ని ఆర్థిక సాయంగా ఇవ్వటంపైన స్పందించారు. "కేటీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం చేయటం సంతోషంగా ఉంది. ఆ విద్యార్థిని ప్రజావాణి కార్యక్రమానికి వస్తే సాయం అందలేకపోవటంతో.. కేటీఆర్ సాయం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తల్ని చూసి సంతోషం అనిపించింది. మొత్తానికి మా ప్రజావాణి లక్ష్యం నెరవేరినట్లే. కేటీఆర్ రూ.లక్ష కోట్లు తిన్నాడు. అందులో రూ.లక్షను సాయం కింద పంచిపెట్టాడు. ఇంకా రూ.99,999 కోట్లు ఉన్నాయి. వాటిని కూడా రాబడతాం" అంటూ వేసిన పంచ్ దిమ్మ తిరిగేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
నిజానికి ఒక నర్సింగ్ విద్యార్థికి చేసిన రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పెద్దగా ప్రచారం చేసుకోకుండా.. దాని గురించి గొప్పగా బయటకు వస్తే బాగుండేది. తాను ఇచ్చిన రూ.లక్షకు పది రెట్లు అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ షురూ చేసినా ప్రజావాణిని బద్నాం చేసేలా మాట్లాడిన కేటీఆర్ కు అందుకు భిన్నంగా.. మళ్లీ నోరెత్తకుండా పంచ్ పడినట్లుగా పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో తాను చేసే సాయాన్ని బయటకు చెప్పుకోరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.