రేవంత్ సర్కార్ కి రేటింగ్ అదిరింది !
తెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చి జనం కలం నిజం చేసిన కాంగ్రెస్ ని తెలంగాణా ఏర్పడిన పదేళ్ళ తరువాత ప్రజలు గెలిపించారు.
By: Tupaki Desk | 19 Aug 2024 3:57 AM GMTతెలంగాణా రాష్ట్రాన్ని ఇచ్చి జనం కలం నిజం చేసిన కాంగ్రెస్ ని తెలంగాణా ఏర్పడిన పదేళ్ళ తరువాత ప్రజలు గెలిపించారు. అలా చూస్తే కనుక ఎన్నో ఆశలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గడచిన ఎనిమిది నెలలలో ప్రజా విశ్వాసం చూరగొందా లేదా అన్న చర్చ అయితే ఉంది. కానీ తాజాగా వచ్చిన ఒక సర్వేను చూస్తే కనుక కాంగ్రెస్ టాప్ ర్యాంక్ కి సాధించింది. అంతే రేవంత్ రెడ్డి సర్కార్ కి అదిరిపోయే రేటింగ్ ని ఇస్తూ జనాలు జై కొట్టేశారు.
ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తూ ప్రణాళికబద్ధంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ కి జనం నిండు మద్దతు ప్రకటించారు. ఒక వైపు సంక్షేమం మరో వైపు అభివృద్దితో కాంగ్రెస్ తెలంగాణను పరుగులు పెట్టిస్తోందని కూడా అశీర్వదించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరుకు 72 శాతం మంది తెలంగాణ వాసులు సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ప్రజలు ఉన్నారని కూడా పల్స్ ఆఫ్ పీపుల్ అనే సర్వే ద్వారా వెల్లడైంది. ఈ సర్వేను తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా ఫుల్ జోష్ తో ఆహ్వానిస్తున్నారు. ఇది తమ ప్రభుత్వ కమిట్మెంట్ కి నిదర్శనం అని వారు అంటున్నారు. కేవలం ఎనిమిది నెలల స్వల్ప వ్యవధిలో తెలంగాణాలో ప్రభుత్వం ప్రజలు పెట్టుకున్న అంచనాలను దాటి ముందుకు వెళ్ళిందని అంటున్నారు.
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చింది అని అంటున్నారు. అలాగే ప్రజా పాలన అన్న మాటను పూర్తి దృఢ నిశ్చయంతో అమలు చేస్తోందని అగ్ని న్యూస్ సర్వీస్ ఇటీవల నిర్వహించిన సర్వేలో స్పష్టం అయింది. దీని మీద తెలంగాణాకు చెందిన కీలక నేతలు స్పందిస్తూ భేషైన పాలన అందిస్తున్నామని అన్నారు.
రేవంత్రెడ్డి నాయాకత్వానికి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దిశా నిర్దేశానికి పడిన మార్కులుగా ఈ సర్వే ఫలితాలను వారు చెబుతున్నారు.తెలంగాణా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంతోంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కలసి ఉత్తమమైన పాలన అందించింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ని అందరూ గర్వించే విధంగా ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతుందని కూడా ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలు పెద్దల మార్గదర్శకత్వానికి లభించిన మెప్పుగా కూడా పేర్కొన్నారు. తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ, తాజాగా వచ్చిన సర్వే ప్రభుత్వానికి ఎంతో పాజిటివ్ గా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆయన చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమం అమలు చేయడమే కాంగ్రెస్ సాధించిన విజయం అని అన్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే టీం వర్క్ అని చెప్పారు.
అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించింది అని తెలంగాణా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ఒక వైపు లోక్ సభ ఎన్నికల వల్ల ఎన్నికల కోడ్ తో కొన్ని నెలలు పోయినా అతి తక్కువ సమయంలోనే తమ ప్రభుత్వానికి మంచి మార్కులు ప్రజలు వేసారు అని అన్నారు. ప్రభుత్వం బాగా పనిచేసింది అని ప్రజలు మెచ్చడం గ్రేట్ అన్నారు.
మహిళలు, యువత, రైతులు ప్రభుత్వ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా ఉన్నాయి అన్నారు. రైతులకు ఒక్కొక్కరికీ రెండు లక్షల దాకా రుణ మాఫీచేయదం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని ఆయన అన్నారు. అలాగే 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వడం,ప్రతీ నెలా200 యూనిట్ల ఉచిత విద్యుత్ ని ఇవ్వడం ఇలా అనేక పధకాలు తమ ప్రభుత్వం అమలు చేసిని అని గుర్తు చేసుకున్నారు.
ఇక ప్రభుత్వం పనితీరు మీద మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉండడం నిజంగా ఆనందకరమని శాసనమండలి సభ్యుడు వెంకట్ బల్మూరి అన్నారు. ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డికే ఈ క్రెడిట్ దక్కుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కల మేలు కలయికకు ఇది మంచి రిజల్ట్ అని అన్నారు.
పల్స్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణా అనే సర్వేలో 72 మంది పూర్తి సంతృప్తిగా ఉన్నారని, కేవలం 21 శాతం మంది మాత్రమే లేరని వెల్లడైంది. మరో 7 శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. మరో 7 శాతం మంది చాలా బాగుంది పాలన అని కితాబు ఇచ్చారు. పది శాతం మంది మంచి పాలన అన్నారు. అగ్ని న్యూస్ సర్వీస్ కి చెందిన ఆర్ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ఈ సర్వే ఆగస్టు 1 నుంచి 10 మధ్యలో చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,664 మంది ఇందులో పాల్గొన్నారు.
అలాగే ఈ సర్వేలో తెలంగాణాకు చెందిన పట్టణ గ్రామీణ ప్రజలు ఉద్యోగులు, వ్యాపారులు, శ్రామిక వరాలు విద్యార్థుల వంటి అనేక సామాజిక వర్గాలు అన్నీ పాల్గొన్నాయి. గత ఎనిమిది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరు ప్రజల అంచనాలను మించింది అని సర్వే ఫలితాలు చెబుతున్నారు. నిజానికి మంత్రిగా కూడా పనిచేయని రేవంత్ రెడ్డి సీఎం గా రాణించగలరన్న డౌట్లు ఉన్న వారికి ఆయన పాలనతో సరైన జవాబు చెప్పారు అని అంటున్నారు.