తెలంగాణలో కీలక పరిణామం... ఐపీఎస్ అంజనీకుమార్ పై సస్పెన్షన్ ఎత్తివేత!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో రాష్ట్ర డీజీపీగా ఉన్న ఆయన... ఫలితాలు వెలువడుతున్నప్పుడు రేవంత్ రెడ్డిని వెళ్లి కలిశారు.
By: Tupaki Desk | 12 Dec 2023 5:50 AM GMTతెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది! ఇందులో భాగంగా... తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై విధించిన సస్పెన్షన్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది.
అవును... ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ ను ఎత్తివేసింది. వాస్తవానికి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్ ను ఈసీ సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో రాష్ట్ర డీజీపీగా ఉన్న ఆయన... ఫలితాలు వెలువడుతున్నప్పుడు రేవంత్ రెడ్డిని వెళ్లి కలిశారు.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై ఈసీకి వివరణ ఇచ్చుకున్న ఆయన.. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి పిలిస్తేనే వెళ్లినట్లు చెప్పారని తెలుస్తుంది. ఈ క్రమంలో మరోసారి ఇలా జరగదని అంజనీకుమార్ ఎన్నికల కమిషన్ కు హామీ ఇచ్చారు.
దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం ఇచ్చింది.
కాగా... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో అంజనీకుమార్ రాష్ట్ర డీజీపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలు వెల్లడవుతుండగానే ఆయన రేవంత్ రెడ్డిని ఇంటికి వెళ్లి కలిశారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది.
దీంతో... ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్ ను సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో దీనిపై ఆయన వివరణ ఇచ్చుకోగా.. ఆ వివరణను పరిగణలోకి తీసుకున్న సీఈసీ.. అంజనీకుమార్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.