షర్మిల పేరును లైట్ తీసేసుకున్న రేవంత్!
తన గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు సహకరించిన వారి పేర్లను ప్రస్తావిస్తూ వారికి థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Dec 2023 6:32 AM GMTఅందుకే అంటారు రాజకీయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలని. ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండటంతో పాటు.. వాతావరణ పరిస్థితులు..ప్రజల మూడ్ కు తగ్గట్లుగా నడుచుకోవటం చాలా ముఖ్యం. ఈ విషయంలో జరిగే పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. గౌరవప్రదంగా ఉండాల్సిన షర్మిల తెలంగాణ ఎన్నికల్లో అంతో ఇంత ప్రభావం చూపించకపోయినా.. ఆమెకు దక్కాల్సిన మర్యాద దక్కేలా చేసుకోవాల్సింది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. తొందరపాటు.. రాజకీయంగా పెద్దగా పరిపక్వత లేకపోవటం ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పాలి. దీనికి తోడు.. తొందరపడి ఒకరిని ఒక మాట అన్నంతనే సరిపోదు. అందుకు తగ్గ మూల్యాన్ని చెల్లించక తప్పదు.
తాజాగా వైఎస్ షర్మిల అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తాజాగా విజయాన్ని సొంతం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి.. తన గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తనకు సహకరించిన వారి పేర్లను ప్రస్తావిస్తూ వారికి థ్యాంక్స్ చెప్పటం తెలిసిందే. అయితే.. ఈ జాబితాలో షర్మిల పేరు లేకపోవటం ఆసక్తికరంగా మారింది.
చేసుకున్నోళ్లకు చేసుకున్న మహదేవ అన్న సామెతను ప్రస్తావిస్తున్నారు. మొన్నటికి మొన్న మీడియాతో మాట్లాడిన సందర్భంలో రేవంత్ రెడ్డి మీద ఘాటు వ్యాఖ్యలు చేయటంతో పాటు.. ఆయనకు కాకుండా మరెవరికైనా సీఎం పోస్టు ఇవ్వాలని కోరటం తెలిసిందే. అంతేకాదు.. రేవంత్ మీద వ్యక్తిగతంగా కాస్తంత దారుణవ్యాఖ్యలు చేశారు షర్మిల. ఓవైపు రేవంత్ కారణంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన విషయాన్నిఆమె గుర్తించకపోవటం దేనికి నిదర్శనం?
ప్రజల మూడ్ ఎలా ఉందన్న విషయాన్ని గుర్తించి.. దానికి తగ్గట్లు మాట్లాడితే బాగుండేది. అందుకు భిన్నంగా తెలంగాణ సీఎంగా రేవంత్ కాకుండా ఉత్తమ్ కానీ భట్టికి కానీ ఇవ్వాలని కోరటం ద్వారా.. ఆమె మిగిలిన వారి ముందు పలుచన కావటంతో పాటు.. తనకెలాంటి సంబంధం లేని అంశంలోకి వెళ్లటం ఎంతమేర సరైనదన్న విషయాన్ని షర్మిల గుర్తిస్తే మంచిది. అందుకే.. మీడియా ముందుకు వచ్చిన ఆయన.. కాంగ్రెస్ గెలుపు క్రెడిట్ ను సీపీఐ, సీపీఎం, కోదండరాంతో సహా పలు పలువురి పేర్లనుప్రస్తావించి.. వారందరికి థ్యాంక్స్ చెప్పటం చూస్తే.. చేజేతులారా షర్మిల తన పొలిటికల్ కెరీర్ ను ఇబ్బందుల్లోకి పడేశారని చెప్పక తప్పదు.