రూ.150 టూ సీఎం... రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జెడ్పీటీసీగా మొదలైన ఆయన రాజకీయ ప్రాస్థానం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకూ చేరింది.
By: Tupaki Desk | 10 May 2024 4:52 AM GMTతెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్న అతితక్కువ మంది నేతల్లో ఎనుమల రేవంత్ రెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ఆయన... ఎటువంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే అత్యున్నత స్థాయికి ఎదిగారు. జెడ్పీటీసీగా మొదలైన ఆయన రాజకీయ ప్రాస్థానం నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకూ చేరింది.
ఈ క్రమంలో తాజాగా.. తన పొలిటికల్ జర్నీపై రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన రేవంత్.. నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా... కేవలం జేబులో రూ. 150తో హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. అలా మొదలైన తన జీవితం... జెడ్పీటీసీగా, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, ఆ తర్వాత రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మీ ముందు ఉన్నానని తెలిపారు.
ఇదంతా కేవలం ప్రజల ఆశీర్వాదమే అని చెప్పిన రేవంత్... తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా తన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర అభివృద్దే ధేయ్యంగా వందేళ్ల ప్రణాళికతో తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో... అతి తక్కువ కాలంలోనే కేసీఆర్ దగ్గర కుర్చీ లాక్కున్నానని.. ఇక లాక్కోవడానికి కేసీఆర్ వద్ద ఏమీ లేదని అన్నారు.
ఈ సందర్భంగా... రాష్ట్ర అభివృద్ధి కోసం పోటీ పడితే కేసీఆర్ ను స్వాగతిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి... పక్కా ప్రణాళికతో పనిచేస్తానని తెలిపారు. ఇదే సమయంలో... తనకు కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ప్రత్యర్థులు లేరని.. ఉన్నదంతా తన సహచరులే అని వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రిగా నాకు అందరూ గౌరవం ఇస్తున్నారని చెప్పారు.
ఇదే క్రమంలో... కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వెనుక హరీష్ రావు కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి... అసెంబ్లీలో కేసీఆర్ స్థానాన్ని హరీష్ రావు లాక్కున్నారని విమర్శించారు. పైగా... అసెంబ్లీకి కేసీఆర్ రాకపోవడం వల్ల హరీష్ రావు ఒక్కడికే లాభం జరుగుతుందని తెలిపారు. తాను మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి రావాలనే కోరుకుంటున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.