Begin typing your search above and press return to search.

డ్రైవర్ లెస్ కారులో సీఎం రేవంత్ జర్నీ

ఇందులో భాగంగా డ్రైవర్ లెస్ (డ్రైవర్ రహిత) కారులో ప్రయాణించారు.

By:  Tupaki Desk   |   12 Aug 2024 6:38 AM GMT
డ్రైవర్ లెస్ కారులో సీఎం రేవంత్ జర్నీ
X

పెట్టుబడులు.. ఉద్యోగ అవకాశాలు పెంచటంతో పాటు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచే బాధ్యతను తలకెత్తుకున్న ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనను పెట్టుకోవటం తెలిసిందే. తాజాగా ఆయన యూఎస్ పర్యటన ముగిసింది. అమెరికా నుంచి బయలుదేరిన ఆయన దక్షిణ కొరియాకు వెళుతున్నారు. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సంగతి తెలిసిందే.

తన అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పటికే పలు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో పాటు.. హైదరాబాద్ ఇమేజ్ ను మరో మెట్టుకు తీసుకెళ్లేలా తన విజన్ ను చెప్పుకొచ్చిన ఆయన.. హైదరాబాద్ లో తమ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ గురించి అందరూ మాట్లాడుకునేలా చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన అమెరికా పర్యటనలో పలు ఆసక్తికర అంశాల్ని ప్రత్యేకంగా పరిశీలించే ప్రయత్నం చేశారు.

ఇందులో భాగంగా డ్రైవర్ లెస్ (డ్రైవర్ రహిత) కారులో ప్రయాణించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో వేమో అనే డ్రైవర్ లెస్ కారులో ప్రయాణించిన ముఖ్యమంత్రి రేవంత్.. ఆ కారు గురించి.. అందులోని ఫీచర్లు.. వాటికి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ డ్రైవర్ లెస్ కారులో ముఖ్యమంత్రి రేవంత్ తో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రయాణించారు.

డ్రైవర్ తో అవసరం లేకుండా సెన్సార్లు.. జీపీఎస్ ట్రాకింగ్ తో కారు ప్రయాణించే తీరు గురించి తెలుసుకున్నారు. డ్రైవర్ లెస్ కారులో రేవంత్ ప్రయాణానికి సంబంధించిన చిట్టి వీడియో.. ఫోటోలు వైరల్ గా మారాయి. విదేశాలకు వెళ్లామా? వచ్చామా? అన్నట్లు కాకుండా.. వెళ్లిన దానికి పూర్తి న్యాయం చేసేలా ఆయన పర్యటన తీరు ఉందన్న మాట వినిపిస్తోంది.