Begin typing your search above and press return to search.

బాబు చేతిలో బుక్...రేవంత్ ఇచ్చిన సందేశమా ?

అయితే గియితే రేవంత్ రెడ్డి దగ్గర బాబుకు కొంత చనువు అయితే ఉండొచ్చు.

By:  Tupaki Desk   |   6 July 2024 4:56 PM GMT
బాబు చేతిలో బుక్...రేవంత్ ఇచ్చిన సందేశమా ?
X

అమ్మో రేవంత్ రెడ్డి అని అంతా అంటున్న పరిస్థితి ఉంది. ఆయన తెలంగాణా సీఎం. కాంగ్రెస్ లో ముఖ్య నేత. ఆయన ఒకనాడు చంద్రబాబు అనుచరుడు కావచ్చు. కానీ ఇపుడు ఆయన ఒక స్టేట్ కి సీఎం. ఆయన అచ్చం అలాగే వ్యవహరించారు. అయితే గియితే రేవంత్ రెడ్డి దగ్గర బాబుకు కొంత చనువు అయితే ఉండొచ్చు. అది పూర్తిగా వ్యక్తిగతం.

రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వస్తే మాత్రం తాను తగ్గేదే లే అని రేవంత్ రెడ్డి పూర్తి స్పష్టత ఇచ్చేశారు. ఆయన చంద్రబాబు మెడలో శాలువ కప్పుతూనే చేతిలో ఒక బుక్ పెట్టారు అది తెలంగాణా కవి కాళోజీ రాసినది. నా గొడవ పేరుతో ఆయన రాసిన ఆ బుక్ లో తెలంగాణాకు పరాయి వాడు హాని తలపెడితే వాడితో సమరమే. సొంత ప్రాంతీయుడే హానీ చేస్తే వాడిని పాతేయడమే అంటూ గర్జించిన సందర్భాలు ఉన్నాయి. నిజాం పాలనలో మగ్గిన తెలంగాణా మీద కాళోజీ రాసిన పుస్తకంలో అణువణువూ తెలంగాణా అస్థిత్వం కాపాడుకోవడం అన్యాయాన్ని ఎదిరించడం వంటివి ఉంటాయి

దానిని బట్టి రేవంత్ రెడ్డి చెప్పకనే సందేశం ఏంటో చెప్పేశారు. తాను ఫక్తు తెలంగాణ వాదిగానే వ్యవహరించారు తన రాష్ట్రం తన గడ్డ అన్నట్లుగానే ఆయన ఈ భేటీలో చర్చలు జరిపారు. హైదరాబాద్ లో ఏపీకి సొంత ఆస్తి ఉండాలని ఒక భవనం అయినా ఇవ్వండి అని అడిగిన ఏపీకి అసలు ఏమీ ఇవ్వలేమని ఖరాఖండీగా చెప్పేశారు. తెలంగాణా స్థిరాస్తులు అన్నీ ఆ రాష్ట్రానికే చెందుతాయని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

అలా రేవంత్ రెడ్డి చాలా ప్లాన్ తోనే ఏపీ సీఎం చేతులు కట్టేశారు అని అంటున్నారు. పైగా ఏపీలో విలీనం అయిన ఏడు మండలాల్లోని అయిదు గ్రామాలను తిరిగి ఇప్పించాలని ఏపీని కోరి ఆ కోరిక మేరకు కేంద్రానికి లేఖ రాసేలా ఒప్పించగలిగారు అని అంటున్నారు.

మొత్తం మీద రాటు దేలిన రేవంత్ రెడ్డి రాజకీయం చూసి అంతా ఔరా అనుకునే లాగా ఉంది. మరో వైపు చూస్తే ఏపీ సీఎం ప్రజాభవన్ లోకి వస్తూనే ఆనందంగా కనిపించారు ఇక డిన్నర్ చేసి వెళ్తున్నపుడు మాత్రం పెద్దగా సంతోషం అయితే కనిపించలేదు అని విజువల్స్ చెబుతున్నాయి.

విభజన సమస్యలు ఎంతో కొంత రేవంత్ రెడ్డి సహకారంతో పరిష్కరించుకోవాలన్న బాబు తాపత్రయం అర్ధం చేసుకోతగినదే కానీ రేవంత్ రెడ్డి కూడా తెలంగాణా సీఎం కదా. ఆయన ఆ పరిధిలూ పరిమితులూ దాటి రాలేరని మరోసారి గట్టిగా చెప్పినట్లు అయింది. మరి బాబు అనుకున్న ముఖా ముఖీ భేటీలో జటిలమైన సమస్యలు పరిష్కారం అవుతాయన్న దానికి ఈ భేటీ ఎంతవరకూ న్యాయం చేసినట్లు అంటే ఆలోచించాల్సిందే.