పోలీసు శాఖ రివ్యూలో ఫటాఫట్ నిర్ణయాలు.. రేవంత్ ఎంత వేగమంటే?
శుక్రవారం తెలంగాణ పోలీసు శాఖపై సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు.. అదే విధంగా కీలక ఆదేశాల్ని జారీ చేశారు.
By: Tupaki Desk | 16 Dec 2023 3:58 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దూసుకెళుతున్నారు. రోజుకు రెండు.. మూడు శాఖల్ని రివ్యూ చేయటమే కాదు.. సమాచారాన్ని కీలక అధికారుల నుంచి తీసుకోవట.. వారు చెప్పేది చెప్పేసిన తర్వాత.. తాను తీసుకోవాల్సిన నిర్ణయాల్ని వరుస పెట్టి తీసేసుకుంటున్నారు. అదే సమయంలో అధికారులకు తనకున్న విజన్ పై క్లారిటీ వచ్చేలా విషయాల్ని చెప్పేస్తున్నారు.
శుక్రవారం తెలంగాణ పోలీసు శాఖపై సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు.. అదే విధంగా కీలక ఆదేశాల్ని జారీ చేశారు. నిరుద్యోగులు పండుగ చేసుకునే మాట సీఎం రేవంత్ నోటి నుంచి వచ్చింది. పోలీసు నియామక ప్రక్రియను వెనువెటనే షురూ చేయాలన్న సీఎం రేవంత్.. పోలీసుతో పాటు వైద్య రోగ్య శాఖల్లో నియామకాల్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నియామకాల్లో ఎలాంటి అవకతవలకు అస్కారం లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోమని పేర్కొన్నారు.
నియామకాల ప్రక్రియలో ఉన్న లోటు పాట్లు.. వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలన్న ముఖ్యమంత్రి రేవంత్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటివరకు చేసిన ఉద్యోగ నియామకాలపై కూడా రిపోర్టు ఇవ్వాలన్నారు. సాధ్యమైనంత త్వరగా పోలీసు ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టంగా చెప్పారు.
ఒక వైపు పోలీసు రిక్రూట్ మెంట్ కు సంబంధించిన తీపికబురు చెప్పిన సీఎం రేవంత్.. ఇప్పటికే పోలీసులుగా విధి నిర్వాహణలో ఉన్న వారి మనసుల్ని దోచుకునేలా నిర్ణయాన్ని ప్రకటించటం గమనార్హం తీవ్రమైన పని ఒత్తిడితో ఉండే పోలీసులు.. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల విద్య కోసం ప్రత్యేక శ్రద్ధ చూపే అంశంపై సీఎం రేవంత్ ప్రకటించారు. పోలీసు ఉన్నతాధికారులు మొదలు కానిస్టేబుల్ వరకు.. ఆర్టీసీలో ఉన్నతాధికారుల నుంచి కండక్టర్ వరకు.. కిందిస్థాయి ఉద్యోగుల పిల్లలతో ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలన్న ఆలోచనను వెల్లడించారు.
దీనికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని.. అందుకు సంబంధించిన నివేదికను తనకు వెంటనే ఇవ్వాల్సిందిగా కోరారు. తాజాగా నెలకొల్పే స్కూళ్లు కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరి ఈ స్కూల్ ఉండాలని.. వీటిని ఉత్తర.. దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు తగిన ప్రతిపాదనల్ని రెఢీ చేయాలని కోరటం చూస్తే.. తాను చేయాలనుకున్న పనిని జెట్ స్పీడ్ తో దూసుకెళ్లేలా చేయటమే సీఎం రేవంత్ తీరు ఉంటుందన్న మాట వినిపిస్తోంది.