Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి పై వ‌రుస పెట్టి కేసులు.. ఏం జ‌రిగింది?

పోలీసుల‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే కేసులు న‌మోదు చేశామ‌ని ఏడీజీ తెలిపారు.

By:  Tupaki Desk   |   15 Aug 2023 7:25 PM GMT
రేవంత్ రెడ్డి పై వ‌రుస పెట్టి కేసులు.. ఏం జ‌రిగింది?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు పోలీసు స్టేష‌న్ల‌లో కేసులు న‌మోద‌య్యా యి. పోలీసుల‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలోనే కేసులు న‌మోదు చేశామ‌ని ఏడీజీ తెలిపారు.

ఐపీసీలోని సెక్షన్‌ 153.. రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు సెక్షన్‌ 504 శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, సెక్షన్‌ 506 బెదిరింపులకు పాల్పడడం కింద కేసు నమోదు చేశారు. మహబూబ్ నగర్‌, జడ్చర్ల, భూత్పూర్ పోలీసు స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి.

అదేవిధంగా నాగర్ కర్నూల్ పోలీసు స్టేష‌న్‌లోనూ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అభియోగంపై ఈ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుణవర్ధన్‌ జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు అయింద‌ని తెలిపారు. ఇక‌, రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ కార్యదర్శి, వంశీ చంద్ రెడ్డి, మరోనేత సంపత్ కుమార్ లపై కూడా కేసులు నమోదు చేశారు.

రీజ‌నేంటి? టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా పోలీసుల‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం డ్యూటీలో ఉన్న పోలీసులు త‌మ హ‌ద్దులు తెలుసుకుని వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు. అంతేకాదు.. త‌మ‌పై త‌ప్పుడు కేసులు పెట్టి వేధించే పోలీసుల జాబితాను రెడీ చేస్తున్నామ‌ని.. అధికారంలోకి వ‌చ్చాక‌.. అలాంటి అధికారుల‌ను గుడ్డ‌లూడ‌దీసి తంతామ‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ ఈ వ్యాఖ్య‌లు చేసిన వెంట‌నే వైర‌ల్ అయ్యాయి. దీంతో పోలీసులు కేసులు న‌మోదు చేయ‌డం గ‌మ‌నార్హం.