Begin typing your search above and press return to search.

"కళ్లజోడు తీస్తే మీలాంటి వాడ్నే"... రేవంత్ రెడ్డి వీడియో వైరల్!

అవును.. తన సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో జరిగిన దసరా ఉత్సవాల్లో స్వయంగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడ సంబరాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   14 Oct 2024 4:06 PM GMT
కళ్లజోడు తీస్తే మీలాంటి వాడ్నే... రేవంత్  రెడ్డి వీడియో వైరల్!
X

ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి దసరా పండగను రేవంత్ రెడ్డి తన సొంతూరు అయిన కొండారెడ్డి పల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ దసరాని తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు, గ్రామ ప్రజలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ సందర్భంగా తన సొంత ఊరిలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలూ చేశారు రేవంత్. ఈ క్రమంలో రేవంత్ తన దసరా సెలబ్రేషన్స్ అన్నీ కలిపి ప్రత్యేకంగా ఓ వీడియో చెయించి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది నెట్టింట హల్ చల్ చేస్తోంది.

అవును.. తన సొంత ఊరు కొండారెడ్డి పల్లిలో జరిగిన దసరా ఉత్సవాల్లో స్వయంగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడ సంబరాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి "గేమ్ ఛేంజర్" సినిమాలోని "రా మచ్చ రా మచ్చ సాంగ్" ని జత చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

"కళ్లజోడు తీస్తే మీలాంటి వాడ్నే.. షర్టు పైకి పెడితే మీలాంటి వాడ్నే.. టక్కు టై తీస్తే నీలాంటివాడ్నే.. నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే.." అంటూ సాగిన ఈ పాట లిరిక్స్.. సొంత ఊరిలో రేవంత్ తన అభిమానులు, అనుచరులు, ఆత్మీయులు, సన్నిహితులు, సహచరులతో అంటున్నట్లుగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

ఈ వీడియోతో పాటు.. "గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.. అనుబంధాలు, శాశ్వతమై మిగిలాయి.. కొండారెడ్డిపల్లిలో ఈ దసరా నా జీవన ప్రస్థానంలో ఆత్మీయ అధ్యాయం" అని రేవంత్ జోడించారు.