ఓటుకు నోటు కేసు ఉన్నన్ని రోజులూ ఇద్దరు సీఎంలు ఏమీ చేయలేరా ?
అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం అప్పట్లో కొంత చల్లారింది అనుకున్న అది ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది.
By: Tupaki Desk | 16 Oct 2024 1:30 PM GMTఎప్పటి ఓటుకు నోటు కేసు. అలా కాలాన్ని పెంచుకుని మరీ ముందుకు పామూలా సాగుతూ వస్తోంది. 2015 జూన్ నెలలో జరిగిన వ్యవహారం అది. అప్పటికి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం తన పార్టీలో ఆనాడు కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రయోగించారు అన్నది ఈ కేసు వెనుక ఫ్లాష్ బ్యాక్.
అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం అప్పట్లో కొంత చల్లారింది అనుకున్న అది ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. బ్రీఫ్డ్ మీ అన్న గొంతుక చంద్రబాబుదే అని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి బాబు పేరు చేర్చాలని కోరినా ఫలితం లేకపోయింది.
అయితే ఈ కేసులో తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విచారణను ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే ఈ కేసు తాజా విచారణ వాయిదా పడింది. అయితే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణలో ఉన్నా అది ఇండైరెక్ట్ గా టీడీపీ మీద చంద్రబాబు మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.
అలా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఓటుకు నోటు కేసులో ఉన్నారనే అంటున్నారు. ఈ ఇద్దరూ వేరు వేరు పార్టీలు అయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో దానికి భయపడుతున్నారు అని అంటున్నారు.
ఏపీలో టీడీపీకి బీజేపీతో పొత్తు ఉంది. తెలంగాణాలో కాంగ్రెస్ నేరుగా బీజేపీని ఢీ కొంటోంది. కానీ రాజకీయాల్లో చాలా తెలియని కోణాలు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసు ఒక పట్టాన తెమలదు. ఆ కేసు అలా సాగుతున్నంత కాలం ఈ ఇద్దరు సీఎంలు బీజేపీకి లొంగి ఉండాలని అంటున్నారు.
ఎందుకు అంటే దేశంలో అందరికీ ఈ కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసు అని అంటున్నారు. ఎవరేమిటి అన్నది కూడా తెలుసు అని అంటున్నారు. ఇక ఈ కేసు ప్రభావం వల్లనేనా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తరచూ బీజేపీ కేంద్ర మంత్రులను తరచూ అఫీషియల్ గా అయినా కలుస్తున్నారు అన్న టాక్ కూడా ఉంది మరి.
లేటెస్ట్ గా చూస్తే కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ హైదరాబాద్ వస్తే ఆయనతో ఒక అఫీషియల్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అంతే కాదు ఏ కేంద్ర మంత్రి వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెళ్తున్నారు. కొన్ని సార్లు వెళ్లక్పోయినా ఫరవాలేదు. రాష్ట్ర మంత్రులు అటెండ్ అవవచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఠంచనుగా హాజరవుతూ బీజేపీ కేంద్ర మంత్రులతో కలసి నవ్వులు చిందిస్తున్నారు.
అంతే కాదు ఆయన ఢిల్లీకి వెళ్ళినపుడు కూడా వరసబెట్టి బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులను కలుస్తూ వస్తున్నారు. తెలంగాణా అభివృద్ధి కోసం అని చెబుతున్నా స్వామి కార్యక్రం స్వకార్యం అన్నది కూడా ఇందులోనే ఉంది అని అంటున్నారు
ఇక ఏపీ సీఎం చంద్రబాబు సంగతి చెప్పనవసరం లేదు ఆయన బీజేపీతోనే ఉన్నారు. వారి నీడలోనే ఉన్నారు. వారు వక్ఫ్ చట్ట సవరణ అన్నా జమిలి ఎన్నికలు అన్నా ఓకే అనాల్సిందే తప్ప వేరే ఆప్షన్ లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక ఇద్దరు తెలుసు సీఎంలు బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉంటున్నారా అంటే విపక్షాలు అయితే అలాగే అంటాయి. కానీ పీత బాధలు పీతవి అన్నట్లుగా రాజకీయాల్లో ఎవరి సమస్యలు వారికి ఉంటాయి కదా అని సెటైర్లు పడుతున్నాయి.