Begin typing your search above and press return to search.

కలిసొచ్చిన ఆరు... రేవంత్, బాబు మధ్య ఆసక్తికరమైన చర్చ!

అవును... ప్రజాభవన్ లో చంద్రబాబు – రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పదేళ్లైన పరిష్కారం కానీ విభజన సమస్యలపై చర్చించారు.

By:  Tupaki Desk   |   7 July 2024 5:15 AM GMT
కలిసొచ్చిన ఆరు... రేవంత్, బాబు మధ్య ఆసక్తికరమైన చర్చ!
X

హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శనివారం కీలక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా నెలకొన్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాని నేపథ్యంలో తాజాగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముగ్గురేసి అధికారులతో ఓ కమిటీని.. ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

అవును... ప్రజాభవన్ లో చంద్రబాబు – రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పదేళ్లైన పరిష్కారం కానీ విభజన సమస్యలపై చర్చించారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. త్వరలోనే ఇరు రాష్ట్రాల సీఎస్ లు, ఉన్నతాధికారులతో ఏర్పాటయ్యే కమిటీలు అన్ని అంశాలనూ చర్చించి పరిష్కారం కనుగునే ప్రయత్నాలు చేస్తాయని.. అక్కడ పరిష్కారం కాని అంశాలపై మంత్రుల కమిటీ చర్చించి నిర్ణయం తీసుకున్న అనంతరం సీఎంలు ఇద్దరూ చర్చిస్తారని అంటున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... ఈ భేటీ సందర్భంగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఇద్దరికీ ఈసారి "సిక్స్" నెంబర్ బాగా కలిసొచ్చిన సంగతి తెలిసిందే. ఆరు గ్యారెంటీలు అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోకి అధికారంలోకి రాగా.. సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చిన టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. దీంతో... ఇద్దరికీ ఈ దఫా "ఆరు" బాగా కలిసొచ్చిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచీ తెలంగాణ ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, తలసరి ఆదాయం పెరుగుదల మొదలైన అంశాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో... రెండు రాష్ట్రాల్లోనూ కీలక హామీగా మారిన "మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం" అంశంపైనా చంద్రబాబు.. రేవంత్ తో కీలకంగా చర్చించారని.. ఆ పథకం అమలు చేసే విషయంలో ఎదురైన సవాళ్లను అడిగి తెలుసుకున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో గత ఏడాది తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయమో ఎలా ముందుకు వెళ్తున్నారనే విషయాన్ని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారని అంతున్నారు. కాగా... ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆ హామీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది వేచి చూడాలి.