తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. తేల్చేసిన అధిష్టానం
పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పారు.
By: Tupaki Desk | 5 Dec 2023 1:56 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి పీఠం రేవంత్ రెడ్డికే దక్కింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ.. దాదాపు పదేళ్ల తర్వాత.. అధికారంలోకి రావడం వెనుక రేవంత్ రెడ్డి కృషిని పార్టీ గుర్తించిందని తెలిపారు. ఆయన డైనమిజంనుపార్టీ మెచ్చుకుంటోదన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డికే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనికి సీఎల్పీలో అందరూ ఆమోదించినట్టు వేణుగోపాల్ వెల్లడించారు.
అయితే.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడిన సీనియర్లకు తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఎవరినీ పార్టీ వదులుకోద న్నారు. కాగా.. గత రెండు రోజులుగా సీఎం సీటును ఎవరికి అప్పగించాలనే విషయంపై పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహించిం ది. హైదరాబాద్ వేదికగా.. తర్వాత.. ఢిల్లీ వేదికగా కూడా .. దీనిపై తీవ్రస్థాయిలో చర్చించింది. ముఖ్యమంత్రి పీఠం కోసం .. ముగ్గురు నుంచి నలుగురు నాయకులు పోటీ పడ్డారు. వీరిలో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దుళ్ల శ్రీధర్ బాబు వంటి సీనియర్ నాయకులు ఉన్నారు.
అయితే.. పార్టీ కోసం పనిచేసి.. పార్టీని ఏకతాటిపైకి తీసుకువచ్చిన రేవంత్‌రెడ్డి వైపు పార్టీ మొగ్గు చూపింది. మరోవైపు.. ఇతర నేతలకు కూడా ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం ద్వారా.. ఉప ముఖ్యమంత్రి గా బట్టి విక్రమార్క, ఆర్థిక శాఖ మంత్రి గా ఉత్తంకుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలావుంటే.. పార్టీ హైకమాండ్ పిలుపుతో రేవంత్‌రెడ్డి హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన పేరు ప్రకటించడానికి కొద్ది క్షణాల ముందు.. ఆయన ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణం చేయనున్నట్టు సమాచారం.