రేవంత్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్... ఆ ఆరుగురు ఎవరు?
అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలతో మంత్రివర్గంలో స్థానం కల్పించేవారి పేర్లపై ఆమోదం తీసుకోనున్నారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 24 Jun 2024 2:30 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఆసక్తినెలకొన్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో రేవంత్ మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుంది.. సామాజికవర్గాల వారీగా ఎవరి కోటా ఇంకా ఎంత మిగిలి ఉంది.. ఈ సమయంలో ఒక్కో పదవికి ఎంతెంత పోటీ ఉందనే విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం...!
అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నారు. తాజా ఢిల్లీ పర్యటనలతో మంత్రివర్గంలో స్థానం కల్పించేవారి పేర్లపై ఆమోదం తీసుకోనున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విస్తరణకు ముహూర్తం ఖరారైందని తెలుస్తుంది. మంత్రివర్గంలో మరో ఆరుగురుకి ఛాన్స్ దక్కనున్న నేపథ్యంలో ఆశవహులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో భర్తీ చేయాల్సిన ఆరు మంత్రి పదవులనూ ఆయా సామాజికవర్గాల నేతలకు రిజ్వర్ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా.. రెడ్డి సామాజికవర్గానికి రెండు, బీసీలకు రెండు, లంబాడీ, మైనారిటీలకు తలో పదవి దక్కే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో... కీలకమైన హోంశాఖను బోదన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే సమయంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లు మంత్రిపదవుల కోసం వేచి చూస్తున్నవారి జాబితాలో ఉన్నారు! అదేవిధంగా బీసీ సామాజికవర్గంలో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి ముదిరాజ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... గత ఏడాది డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు 11 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ సమయంలో కీలకమైన హోంశాఖ, విద్యా, ముస్నిపల్, కార్మిక శాఖలు ముఖ్యమంత్రివద్దే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది.