Begin typing your search above and press return to search.

సర్జికల్ దాడుల గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు?

2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ ప్రధాన అంశంగా బీజేపీకి ప్లస్ అయ్యాయి. దీంతోనే బీజేపీ విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   11 May 2024 5:49 AM GMT
సర్జికల్ దాడుల గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు?
X

2019 ఎన్నికల్లో సర్జికల్ స్ట్రైక్స్ ప్రధాన అంశంగా బీజేపీకి ప్లస్ అయ్యాయి. దీంతోనే బీజేపీ విజయం సాధించింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్జికల్ దాడుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయో లేదో దేవుడికే తెలియాలి అని కామెంట్ చేశారు. దీంతో ఇప్పుడు చర్చ సర్జికల్ స్ట్రైక్స్ మీదే నడుస్తోంది.

రేవంత్ రెడ్డి సర్జికల్ దాడుల గురించి మాట్లాడుతూ అవి తెచ్చినవా? లేక వచ్చినవా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ దాడుల గురించి బీజేపీకే తెలియాలని అంటున్నారు. ప్రస్తుతం సర్జికల్ దాడుల అంశం కూడా రిజర్వేషన్ల మాదిరి బీజేపీకి గుదిబండగా మారనుందా? అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ అంశం తీసుకున్నా బీజేపీని ఇరుకున పెడుతున్నారని తెలుస్తోంది.

ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డికి వచ్చిన అనుమానం తీర్చేదెవరు? సర్జికల్ దాడుల గురించి బీజేపీ వారే క్లారిటీ ఇవ్వాలి. పుల్వామా దాడి ఎందుకు జరిగింది? దాడి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణనష్టం జరిగేది కాదు కదా అంటున్నారు. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ పటిష్టంగానే ఉంది. దేశాన్ని రక్షించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెబుతున్నారు.

దీంతో ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో రేవంత్ లేవనెత్తిన ప్రశ్నకు బీజేపీ ఏం సమాధానం చెబుతుంది. దేశ అంతర్గత భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అనే విషయాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈక్రమంలో రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి మదిలో నానుతోంది.

దేశ భద్రత విషయంలో రాజీ లేదని బీజేపీ చెబుతూనే ఉంది. దేశ రక్షణ కోసం దేనికైనా పోరాడతామని చెబుతోంది. రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కూడా బీజేపీ సరైన సమాధానం చెబుతుందని అంటున్నారు. కాంగ్రెస్ అడిగే ఏ ప్రశ్నకైనా బీజేపీ జవాబు ఇస్తుందని బీజేపీ నేతలు తమదైన శైలిలో కాంగ్రెస్ పై కౌంటర్లు వేయడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం.