Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్!

ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరున్న రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   22 Jun 2024 9:44 AM GMT
చంద్రబాబుపై రేవంత్  రెడ్డి ఇంట్రస్టింగ్  కామెంట్స్!
X

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా చంద్రబాబు కష్టపడే తత్వం, దూరదృష్టి ఫలితంగా ఈ ఐదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చడంతోపాటు అభివృద్ధిలోనూ ముందుకు తీసుకెళ్తారని ప్రజలు భావిస్తున్నారు.

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చంద్రబాబు & కో కు ఇప్పుడు ఎంతో ముఖ్యం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి, గతంలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడనే పేరున్న రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా... 30వ వార్షికోత్సవానికి కూడా తానే వస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రి లీజు వివాదాన్ని కేబినెట్ లో పరిష్కరించామని.. భవిష్యత్తులో ఈ ఆస్పత్రికి అండగా ఉంటామని రేవంత్ తెలిపారు.

ఈ సమయంలోనే చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీ పడే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. చంద్రబాబు 18 గంటలు పనిచేసి.. తాను 12 గంటలు పనిచేస్తే సరిపోదని ఈ సందర్భంగా రేవంత్ అన్నారు.

ఇదే క్రమంలో... తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పనిచేయాల్సిందే అని సూచించారు! ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధిలో పోటీ పడాలని.. పరపంచానికి ఆదర్శంగా నిలవాలని రేవంత్ ఆకాంక్షించారు. త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు తెలిపారు.

మరోపక్క ఆస్పత్రి సేవల విస్తరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి సహకారం కోరగానే అంగీకరించారని బసవతారకం ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. దాతల సహకారంతోనే ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఈ సేవలను మరింత విస్తరించాలని అన్నారు.