Begin typing your search above and press return to search.

షర్మిలను కార్నర్ చేసిన రేవంత్ హాట్ కామెంట్స్...!?

రాజకీయాలలో అలాగే ఉంటుంది. ఎవరు ఏ గూటి నుంచి వచ్చారో ఆ గూటి పలుకులె పలుకుతారు

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:44 AM GMT
షర్మిలను కార్నర్ చేసిన రేవంత్ హాట్ కామెంట్స్...!?
X

రాజకీయాలలో అలాగే ఉంటుంది. ఎవరు ఏ గూటి నుంచి వచ్చారో ఆ గూటి పలుకులె పలుకుతారు. ఈ రోజు కాంగ్రెస్ కి సీఎం గా ఉన్నా రేవంత్ రెడ్డి పక్కా కాంగ్రెస్ మనిషి అయితే కాదు. ఆయన వైఎస్సార్ మీద టీడీపీ నుంచి రాజకీయ పోరాటం చేశారు.

ఇవన్నీ పక్కన పెడితే ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణా సీఎం రేవంత్ దివంగత నేత వైఎస్సార్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆయన అభిమానులలో మంట పుట్టిస్తున్నాయి. అంతే కాదు దీని మీద కాంగ్రెస్ లో చేరిన షర్మిల ఏమంటారు అని వైఎస్సార్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు

వైఎస్సార్ ని ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి పొగిడారు. ఆయన విగ్రహానికి కూడా దండం పెట్టారు. ఆయన ఆశయాలను పాటిస్తామని అన్నారు. అయితే నెల రోజుల ముఖ్యమంత్రిగా అనుభవం సంపాదించిన ఆయన ఒక టీడీపీ అనుకూల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం వైఎస్సార్ మీద అనుచిత వ్యాఖ్యలే చేశారు.

ఆ ఇంటర్వ్యూలో ఫిరాయింపుల అంశం చర్చకు వచ్చింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవడానికి వైఎస్సార్ చేశారు అంటూ ఇంటర్వ్యూ నిర్వాహకులు రేవంత్ రెడ్డికి గుర్తు చేశారు. దానికి రేవంత్ రెడ్డి అవును ప్రయత్నం చేశారు. కానీ దానికి ప్రకృతి ఒప్పుకోదు కదా అది రకరకాలైన పరిణామాలకు దారి తీస్తుంది కదా అంటూ అనుచితమైన కామెంట్స్ చేశారు.

అదిపుడు గట్టిగా రగులుకుంటోంది. వైఎస్సార్ గురించి అంత నీచంగా మాట్లాడుతారా అని వైఎస్సార్ అభిమానులు మండిపడుతున్నారు. వైఎస్సార్ గురించి ప్రకృతి అంటూ ఏవేవో అర్ధాలు వచ్చేలా మాట్లాడడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంలో కాంగ్రెస్ లో చేరిన ఆయన కుమార్తె షర్మిల స్పందించాలని కూడా కోరుతున్నారు. ఒక వైపు వైఎస్ షర్మిలకు ఏపీలో రాజకీయంగా సహకరిస్తాను అని చెబుతూ మరో వైపు వైఎస్సార్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం రేవంత్ కే చెల్లింది అని అంటున్నారు. అంతే కాదు ఏపీ సీఎం వైఎస్ జగన్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అభినందిస్తూ ట్వీట్ చేశారని, దానికి థాంక్స్ అని రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారని కూడా గుర్తు చేస్తున్నారు.

దానిని మరచిపోయి ఏపీ సీఎం తనను అభినందించలేదు అని ఆ ఇంటర్వ్యూలో చెప్పడాన్ని ఏమనుకోవాలని అంటున్నారు. టోటల్ గా వైఎస్సార్ గురించి రేవంత్ కామెంట్స్ చేస్తూంటే అదే పార్టీలో షర్మిల ఎలా ఉంటారని కూడా అభిమానులు నిగ్గదీస్తున్నారు..

మొత్తానికి చూస్తే వైఎస్సార్ బొమ్మ పెట్టుకుని ఆయన కుమార్తెతో ఏపీ రాజకీయాల్లో ఏదో సాధించాలని కాంగ్రెస్ చూస్తున్నా వారి మనసులలో మత్రం వైఎస్సార్ అంటే ఉన్న భావన ఆయన కుటుంబం పట్ల ఉన్న భావన పదే పదే బయటపడుతోందనీ అంటున్నారు

ఏది ఏమైనా రేవంత్ రెడ్డి చేసిన ఈ హాట్ కామెంట్స్ ఏపీలో షర్మిలను కార్నర్ చేసేలా ఉన్నాయి. ఆమె వైపు నుంచి చూస్తే తెలంగాణాలో తన రాజకీయాన్ని మొదలెట్టి అక్కడ ఏమీ కాకుండానే పార్టీని మూసేశారు. ఇపుడు ఏపీలో సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు. ఈ ఇన్నింగ్స్ ని కాంగ్రెస్ తరఫున ఆడబోతున్నారు.

వైఎస్సార్ ఫ్యామిలీని ఏపీ ని మోసం చేసిన కాంగ్రెస్ పక్షాన షర్మిల రాజకీయ అరంగేట్రం చేస్తూ సొంత సోదరుడి ప్రభుత్వం మీదనే రాజకీయ యుద్ధం చేయబోతున్నారు అని అభిమానులు మండిపడుతున్నారు. తన తండ్రిని ఇలా అవమానించిన కాంగ్రెస్ పార్టీ నేతల తీరు మీద షర్మిల మాట్లాడాలని వైఎస్సార్ అభిమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వైసీపీకి కొత్త ఆయుధాన్ని రేవంత్ రెడ్డి ఇచ్చారనే అంటున్నారు.