Begin typing your search above and press return to search.

సీఎంకు సమన్లు... రేవంత్ కు కోర్టు నోటీసులు ఎందుకంటే..?

aపరువునష్టం కేసులో సెప్టెంబరు 25న కోర్టుకు హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది.

By:  Tupaki Desk   |   23 Aug 2024 9:22 AM GMT
సీఎంకు సమన్లు... రేవంత్ కు కోర్టు నోటీసులు ఎందుకంటే..?
X

పరువునష్టం కేసులో సెప్టెంబరు 25న కోర్టుకు హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. రేవంత్ పై బీజేపీ నాయకులు పరువునష్టం దావా వేశారు. గత మే నెలలో జరిగిన ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ భారతీయ జనతాపార్టీ నేతలు దావా వేశారు.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు బీజేపీ నాయకులు. తమ పార్టీపై అసత్య ప్రచారం చేశారంటూ దావా వేయడంతో... హైదరాబాద్ లోని ప్రజాప్రతినిధుల కోర్టు తెలంగాణ సీఎంకు నోటీసులు పంపించింది. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తుందని రేవంత్ ప్రచారం చేశారనేది ఆరోపణ!

ఇలాంటి ప్రచారం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందని.. తమ పార్టీపై అపనమ్మకం కలిగిందని.. ఆ అసత్య ప్రచారం వల్ల తమ పార్టీకి నష్టం జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా స్పందించిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు... రేవంత్ రెడ్డి చేసిన ప్రచారంలో నిజం లేదని, ప్రజల్లో పార్టీపై అపనమ్మకం కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల తమ పార్టీ పరువుకు నష్టం కలిగిందని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సాక్ష్యాత్తు సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

కాగా ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 4న ఖమ్మ జిల్లా సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి... బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తుందని ఆరోపించారు! ఈ నేపథ్యంలో బీజేపీ పరువునష్టం దావా వేసింది.. ఈ కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చెసింది.