Begin typing your search above and press return to search.

1.. 2.. 3.. మొత్తం 17.. నెలకు 2 పైనే రేవంత్ సార్.. ఢిల్లీ టూర్లు

ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పాలనలో అవినీతి లేకున్నా.. తరచూ ఒకటే విమర్శ వచ్చేది

By:  Tupaki Desk   |   3 July 2024 9:59 AM GMT
1.. 2.. 3.. మొత్తం 17.. నెలకు 2 పైనే రేవంత్ సార్.. ఢిల్లీ టూర్లు
X

ఉమ్మడి ఏపీలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పాలనలో అవినీతి లేకున్నా.. తరచూ ఒకటే విమర్శ వచ్చేది.. చర్చ సాగేది.. హై కమాండ్ ను కలవడం కోసం అంటూ ఆయన ఢిల్లీకి వెళ్లి రోజుల తరబడి ఉండేవారు. దీంతో పత్రికల్లో కార్టూన్లు వేసేవారు. ఈ కారణంగానే కాంగ్రెస్ ఓడిపోయేది కూడా. అయితే, 2004 తర్వాత కమ్యూనికేషన్ పెరగడం, కాంగ్రెస్ హై కమాండ్ ధోరణిలోనూ మార్పు రావడంతో సీఎంల ఢిల్లీ టూర్లు తగ్గాయి. తెలంగాణ ఏర్పడిన అనంతరం పదేళ్లు అధికారానికి దూరమైంది కాంగ్రెస్. ఇదే సమయంలో ఏపీలో అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోయారు. మరో ఐదేళ్లు కూడా ఏపీలో నామమాత్ర పార్టీగానే కాంగ్రెస్ కొనసాగక తప్పని పరిస్థితి.

వెళ్లక తప్పదు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని సీఎం చేసింది. ఆయన దీనికిముందు ఎంపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనూ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చేది. మరోవైపు సీఎం అయ్యాక కూడా తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. తొలిసారిగా సీఎం అయ్యాక హై కమాండ్ కు థ్యాంక్స్ చెప్పేందుకు వెళ్లారు. ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామాకు వెళ్లారు. ఇటీవల లోక్ సభ ఎన్నిలకు ముందు అభ్యర్థుల ఎంపికకూ వెళ్లాల్సి వచ్చింది.

సీఎం అయ్యాక 17 సార్లు

జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ. అందులోనూ హై కమాండ్ తో చర్చించాలంటే ఢిల్లీ వెళ్లక తప్పదు. కాగా, లోక్ సభ ఎన్నికల అనంతరం రేవంత్ కు మరో చిక్కొచ్చి పడింది. అదే టీపీసీసీ అధ్యక్షుడి నియామకం. తాను బాధ్యతల నుంచి వైదొలగుతూ మరొక నాయకుడిని నియామకానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనాల్సి వస్తోంది. దీంతో తరచూ ఢిల్లీ వెళ్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులనూ కలిసి రాష్ట్రానికి సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తూ నిధుల మంజూరును కోరుతున్నారు. మొత్తమ్మీద సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి 17 సార్లు ఢిల్లీకి వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఈ అంశం విపక్షానికి మరీ ముఖ్యంగా వారి మీడియాకు ఓ కీలక పాయింట్ గా మారుతోంది. రాజకీయ విమర్శలకు అవకాశం ఇస్తోంది. అయితే, రేవంత్ ఢిల్లీ పర్యటనలన్నీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కాదు అనే విషయాన్ని గమనించాలి. రాష్ట్ర డెవలప్ మెంట్ కు సంబంధించిన అంశాలతో పాటు పార్టీ పరమైన చర్చల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్లిన సంగతిని కాంగ్రెస్ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. అయితే, ఒకటి మాత్రం నిజం.. ఏడు నెలల్లో 17 సార్లు ఢిల్లీ వెళ్లడం అంటే నెలలో కనీసం రెండుసార్లు అన్నమాట.