తెలంగాణలో గాడిదగుడ్డు రాజకీయం
ఆంధ్రాలో అమరావతికి మట్టి మొకాన కొట్టిండన్న రేవంత్ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడని ఎద్దేవా చేస్తున్నాడు.
By: Tupaki Desk | 5 May 2024 5:52 AM GMTతెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది ? గాడిదగుడ్డు ఇచ్చింది అని చెప్పండి అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సభల్లో ప్రజలను అడిగి సమాధానం రాబడుతున్నాడు. ఆంధ్రాలో అమరావతికి మట్టి మొకాన కొట్టిండన్న రేవంత్ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాడని ఎద్దేవా చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ రేవంత్ వ్యాఖ్యలపై విరుచుకు పడుతున్నది. కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రుణమాఫీ, వరికి క్వింటాలుకు రూ.500 బోనస్, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు, విద్యార్థులకు రూ.5 లక్షలు, నిరుద్యోగులకు రూ.4 వేలు, మహిళలకు రూ.2500 మొత్తం ఏడు గాడిద గుడ్లు కాంగ్రెస్ ఇచ్చిందని బీజేపీ విమర్శలు గుప్తిస్తున్నది.
ఈ మధ్య ప్రతి ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గుడ్డు అంశాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలోనూ కాంగ్రెస్ గాడిద గుడ్డును గట్టిగానే ప్రమోట్ చేస్తోంది.
జీఎస్టీ రూపంలో తెలంగాణ నుంచి డబ్బులు వసూలు చేసిందని, తిరిగి తెలంగాణకు గాడిద గుడ్డును ఇస్తుందని చెబుతున్నది. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు నిధులు తరలిస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఆ నేపథ్యంలో గుడ్డు రాజకీయం ఎక్కడిదాకా వెళ్తుందోనని రాజకీయ విశ్లేషకులు పరిశీలిస్తున్నారు.