రేవంత్ వర్సెస్ జగన్... ఏపీలో కొత్త సీన్...!
తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. ఆయన కేసీఆర్ అనే పొలిటికల్ లెజెండ్ ని గద్దె దించారు
By: Tupaki Desk | 24 Feb 2024 1:30 AM GMTతెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన చేస్తున్నారు. ఆయన కేసీఆర్ అనే పొలిటికల్ లెజెండ్ ని గద్దె దించారు. కాంగ్రెస్ వంటి పార్టీలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతగా మారిపోయారు. ముఖ్యమంత్రిగా తన మార్క్ ని చూపిస్తున్నారు. మూడు నెలల రేవంత్ రెడ్డి పాలన చూసుకుంటే కనుక బాగానే ఉంది అనే అంటున్నారు. ఇటీవల వస్తున్న సర్వేలు సైతం మరోసారి కాంగ్రెస్ దే విజయం అని చెబుతున్నాయి.
ఎపుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ కే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని కూడా జోస్యాలు వెలువడుతున్నాయి. అలా సక్సెస్ ఫుల్ లీడర్ గా ఉన్న రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకుని వచ్చి అక్కడ హస్త రేఖలు సరిచేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. అది సహజం కూడా. ఉమ్మడి ఏపీగా రెండు ప్రాంతాలూ ఒక్కటే. విభజన జరిగినా ఏపీలోనూ అదే రాజకీయం ఉంటుంది.
దాంతో రేవంత్ రెడ్డి తెలంగాణా వరకూ బేఫికర్ గా ఉన్నారు కాబట్టి ఏపీ ఎన్నికల మీద కొంత ఫోకస్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఏపీలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన అనేక కీలక ప్రాంతాలు నగరాలలో బహిరంగ సభలు నిర్వహించి కాంగ్రెస్ కి కొత్త బలం ఇస్తారని అంటున్నారు.
ఇక్కడ మరో విషయం కూడా ప్రచారంలో ఉంది. ఏపీ కాంగ్రెస్ పదేళ్ళుగా అధికారంలో లేక చితికిపోయింది. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉనికి పోరు సాగిస్తోంది. అందువల్ల కాంగ్రెస్ కి అంగబలం అర్ధబలం కూడా తెలంగాణా నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటున్నారు అని అంటున్నారు.
అదే విధంగా తెలంగాణా ఎన్నికల్లో తనదైన వ్యూహంతో పార్టీని విజయతీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి ఏపీలో కూడా కొత్త వ్యూహరచన చేస్తారు అని అంటున్నారు. అయితే ఆయన ఎన్నికల ప్రచారం ఏపీలో స్టార్ట్ చేస్తే జగన్ మీద సరికొత్త విమర్శలు ఏపీ జనాలు వినే అవకాశాలు కచ్చితంగా ఉంటాయని అంటున్నారు.
నిజానికి చూస్తే రేవంత్ రెడ్డి జగన్ ల మధ్య పెద్దగా పరిచయాలు లేవు. ఇద్దరి రాజకీయ తోవలు వేరు. ఇద్దరూ అసలైన రాజకీయాన్ని 2009 ఎన్నికల నుంచే ప్రారంభించారు. ఇక ఇద్దరూ ఒకే ఈడు వారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు రేవంత్ రెడ్డి మాటల దూకుడు చేస్తారు అని పేరుంది. ఆయన మాటలు పంచులకు తెలంగాణాలో యూత్ అభిమానులుగా మారిపోయారు.
ఏపీలో కూడా రేవంత్ కి క్రేజ్ ఉందని అంటున్నారు. అలా ఆయన ఏపీలో తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపుని అయితే తీసుకుని వస్తారు అని అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న జగన్ ని మాత్రమే విమర్శించి ఊరుకుంటారా లేక ప్రతిపక్షంలో చంద్రబాబుని కూడా విమర్శిస్తారా అన్నదే ఇక్కడ కీలక పాయింట్.
ఆయన బాబుని పక్కన పెట్టి జగన్ మీదనే విమర్శలు చేస్తే విని ఎంజాయ్ చేస్తారు తప్ప ఫలితం ఉండదు. అలా కాకుండా ఏపీలోని మొత్తం పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్న అన్ని పార్టీలను విమర్శిస్తే కనుక కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ పెరిగే చాన్స్ ఉంది. ఇక ఇప్పటిదాకా జగన్ మీద పెద్దగా విమర్శలు చేయని రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి బిగ్ సౌండ్ చేస్తే అపుడు రాజకీయం కొత్త మలుపు తిరుగుతుంది అని అంటున్నారు దానికి బదులు జగన్ నుంచి వైసీపీ నేతల దాకా ఇచ్చే చాన్స్ ఉంటుంది. అలా ఏపీ రాజకీయం రసకందాయంలో పడుతుంది అని అంటున్నారు.