Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు అలా షాకిచ్చిన రేవంత్... తెరపైకి హిమాన్షు పేరు!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన అనంతరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి

By:  Tupaki Desk   |   8 Feb 2024 3:30 PM GMT
కేసీఆర్ కు అలా షాకిచ్చిన రేవంత్... తెరపైకి హిమాన్షు పేరు!
X

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చిన అనంతరం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పైగా... కాంగ్రెస్ వర్సెస్ బీఆరెస్స్ అంటూ అసెంబ్లీ లోపలా, బయటా సాగుతున్న మాటల యుద్ధాలకు తోడు తాజాగా రేవంత్ చేస్తున్న పనులను... పొలిటికల్ ర్యాగింగ్ గా అభివర్ణిస్తున్నారు పరిశీలకులు. 10ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు చిన్న రూం కేటాయించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనేది మాంచి హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. పైగా... తాను సీఎం అయిన తర్వాత రేవంత్ ఏ విషయంలోనూ తగ్గడం లేదు. ఏమాత్రం అవకాశం ఉన్నా... కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ పై తనదైన సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా బీఆరెస్స్ లెజిస్లేటివ్ పార్టీకి జరిగిన గదుల కేటాయింపుల్లో రేవంత్ & కో వ్యవహరించిన తీరు ఫుల్ రివేంజ్ పాలిటిక్స్ అని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... తెలంగాణా అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తెలంగాణ అసెంబ్లీలో తాజాగా బీఆరెస్స్ లెజిస్లేటివ్ పార్టీ (బీఆరెస్స్ ఎల్.పీ)కి గదుల కేటాయింపు జరిగింది. ఈ సమయంలో ఔటర్ లాబీలో రూమ్ నెంబర్ 1, 2 లను బీఆరెస్స్ ఎల్పీ కి కేటాయించడం జరిగింది. అయితే... గతంలో ప్రతిపక్ష నేతగా జానారెడ్డి, భట్టి విక్రమార్కలకు కేటాయించిన ఛాంబర్ ను ప్రస్తుత ప్రతిపక్షం బీఆరెస్స్ కు కేటాయించలేదు.

ఇందులో ప్రధానంగా... ప్రతిపక్ష నేత కేసీఆర్ కు షాక్ ఇస్తూ ఆయన ఛాంబర్ ను మార్చింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగా ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా, ఒక చిన్న రూమును కేటాయించారని తెలుస్తుంది! దీంతో... ఈ విషయంపై బీఆరెస్స్ పార్టీ నేతలు కారాలు, మిరియాలూ నూరేస్తున్నారు! దీంతో... ఈ అంశాన్ని రేవంత్ ర్యాగింగ్ అని కొందరంటుంటే... ఇది ప్రభుత్వ కక్షపూరిత చర్య అని బీఆరెస్స్ నేతలు చెబుతున్నారు.

ఇలా సుమారు 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని.. ఔటర్ లాబీకి మార్చడంపై బీఆరెస్స్ ఎమ్మెల్యేలలో చర్చ కొనసాగుతుంది. దీనిపై అసెంబ్లీ స్పీకర్ ను కలిసి చర్చించనున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... బీఆరెస్స్ ను ఇరుకున పెట్టడానికి, కేసీఆర్ ను గిల్లడానికి అందివచ్చిన ఏ అవకాశాన్ని రేవంత్ వదులుకోవడం లేదనే కామెంట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తుండటం గమనార్హం.

కేసీఆర్ బదులు హిమాన్షు వస్తానంటే...?

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరు కాలేదని.. కనీసం బీఏసీ సమావేశానికి కూడా రాలేదని.. దీంతోనే ఆయన చిత్తశుద్ధి ఏమిటో తెలిసిపోయిందని తాజాగా రేవంత్ రెడ్డి అన్నారు. హరీష్ రావును బీఏసీకి ఆయనను అనుమతించాలో లేదో స్పీకర్ నిర్ణయమని స్పష్టం చేశారు. రేపు కేసీఆర్ స్థానంలో హిమాన్ష్ కూడా వస్తా అంటే ఎలా అని ప్రశ్నించారు.

కాగా... అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, బీఆరెస్స్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి కేసీఆర్ బదులుగా హరీష్ వచ్చారని.. ఆయనకు అనుమతి లేదని బయటకు పంపించేసినట్లు తెల్సుతుంది. దీనిపైనే రేవంత్ పై విధంగా స్పందించారు!!