Begin typing your search above and press return to search.

కేసీఆర్ ని వెంటాడుతున్న రేవంత్... నల్లమల అడవుల నుంచి మెట్టు మెట్టు...!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ పై ఫైరయ్యారు

By:  Tupaki Desk   |   9 Feb 2024 1:41 PM GMT
కేసీఆర్ ని వెంటాడుతున్న రేవంత్... నల్లమల అడవుల నుంచి మెట్టు మెట్టు...!
X

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ పై ఫైరయ్యారు. సందర్భం ఏదైనా, సమయం మరేదైనా... ఇంతకాలం తెలంగాణను పాలించిన కేసీఆర్ ని రేవంత్ టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణకు కొన్ని విషయాల్లో అన్యాయం జరగడానికి ప్రధాన కారణం కేసీఆర్ వైఖరి అంటూ దుబ్బయట్టారు. ఇదే సమయంలో కేసీఆర్ అసెంబ్లీ సెషన్స్ కి గైర్హాజరవ్వడంపైనా రేవంత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో తన ఫ్లాష్ బ్యాక్ ను సగర్వంగా చెప్పుకున్నారు!!

అవును... అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ గైర్హాజరు అవ్వడంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులకు, కుటుంబాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని.. ఆయనలో మార్పు రావాలనే ప్రతిపక్ష హోదా కట్టబెట్టారని అన్నారు. దురదృష్టవశాత్తు గవర్నర్ ప్రసంగం రోజు, ఆ ప్రసంగంపై చర్చ జరుగుతున్న రోజు కూడా ప్రధాన ప్రతిపక్షనేత కేసీఆర్ సభకు రాలేదని విమర్శించారు. కేసీఆర్ గైర్హాజరు కాకపోవడం ఈ సభకు శోభ తీసుకురాదని అన్నారు.

ఇదే సమయంలో... 80 వేల పుస్తకాలు చదివిన మేధావిని అని చెప్పుకునే కేసీఆర్ సభకు రాకపోవడం పై రేవంత్ ఆక్షేపిస్తూ... భవిష్యత్ లోనైనా ఆయన సభకు వస్తారని ఆశిస్తున్నామని అన్నారు. అదేవిధంగా... ప్రజాభిప్రాయం మేరకే తెలంగాణ చిహ్నంలో, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, వాహనాలపై టీజీ, జయజయహే తెలంగాణ గీతం వంటి నిర్ణయాలను తీసుకున్నామని రేవంత్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా... తాను తండ్రీ తాతల పేర్లు చెప్పుకుని, ఉద్యమం ముసుగులో ఇక్కడికి రాలేదని నొక్కి చెప్పిన రేవంత్ రెడ్డి... నల్లమల అడవుల నుంచి మెట్టు మెట్టూ ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవంతోనే ఇక్కడివరకూ వచ్చినలు స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు:

తాజాగా రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... ఓటుకు నోటు కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను మధ్యప్రదేశ్‌ కు మార్చాలంటూ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. వీటిపై నాలుగు వారాల్లో స్పందించి సమాధానం చెప్పాలని సూచించింది.