Begin typing your search above and press return to search.

నా కుమారుడికి మంత్రి పదవి అక్కర్లేదు.. జానారెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

By:  Tupaki Desk   |   11 Dec 2023 11:03 AM GMT
నా కుమారుడికి మంత్రి పదవి అక్కర్లేదు.. జానారెడ్డి
X

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వయోభారం రీత్యానో మరే కారణాల వల్లనో అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడిని గెలిపించుకున్నారు. ఈనేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు ముచ్చటించుకున్నారు. వారి మధ్య రాజకీయపరమైన అంశాలేవీ చర్చకు రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందున కలిసి మెలిసి పనిచేయాలని సూచించారు. రాజకీయ భవితవ్యం నిలబడాలంటే మన పనితీరే ప్రామాణికమని చెప్పారు. సీనియర్లు, జూనియర్లు అందరు కలిసి ఐక్యంగా పనిచేస్తే మంచి ఫలితాలుంటాయని సూచించారు. కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం ఉండాలని తన మనసులోని మాట వెల్లడించారు.

తన కొడుకు ఇప్పుడే ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రి పదవి కావాలని అడగడం సమంజసం కాదు. ఇంకా రాజకీయాల్లో అనుభవం గడించాలి. అప్పుడే మంత్రి పదవులు దక్కుతాయి. అన్నప్రాసన రోజే ఆవకాయ కావాలంటే కుదరదు అని అభిప్రాయపడ్డారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే నల్లగొండ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానన్నారు. సీఎం, మంత్రులు ఐకమత్యంతో పనిచేస్తే ముందుకు వెళ్లడం ఖాయం.

జానారెడ్డి సీఎంను కలవడంతో అందరు తన కొడుకుకు మంత్రి పదవి ఇవ్వాలని అడిగేందుకు వెళ్లినట్లు భావిస్తున్నారు. కానీ జానారెడ్డి మాత్రం తాను అందుకు రాలేదని సమాధానం ఇచ్చారు. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీని కోసమే అన్ని మార్గాలు అన్వేషిస్తోంది. సమర్థులైన నాయకుల కోసం వెతుకుతున్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు గెలుచుకుని కేంద్రంలో అధికారం దక్కించుకోవాలని ఆశిస్తోంది. సీనియర్లకు టికెట్లు ఇచ్చి పార్టీకి గుర్తింపు తెచ్చుకోవాలని అధిష్టానం చూస్తోంది. కర్ణాటకతో పాటు తెలంగాణలో అధికారం దక్కించుకోవడంతో ఇక్కడ నుంచి పార్టీకి అధిక ఎంపీలు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నారు.