Begin typing your search above and press return to search.

టీడీపీ పుట్టిల్లు... చంద్రబాబు అంటే ఇష్టమే అంటున్న రేవంత్...!

ఇక చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా అని కూడా మరో డౌట్ వెలిబుచ్చారు.

By:  Tupaki Desk   |   13 Nov 2023 10:52 AM GMT
టీడీపీ  పుట్టిల్లు...  చంద్రబాబు అంటే ఇష్టమే అంటున్న రేవంత్...!
X

తెలంగాణాలో పోలింగుకు గడువు దగ్గరపడుతున్న వేళ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అన్నారా లేక బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చారా అన్నది పక్కన పెడితే చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదని చెప్పానా అని మీడియానే ప్రశ్నించారు. అంటే తనకు బాబు అంటే చాలా ఇష్టమని చెప్పేసుకున్నారు.

టీడీపీ తన పుట్టిల్లు అని కావాల్సిన టైం లో ఆయన సరైన స్టేట్మెంట్ ఇచ్చారు అని కూడా భావించాల్సి ఉంటుంది. అంతే కాదు కాంగ్రెస్ ని అత్తింటితో పోల్చారు. తాను టీడీపీకి కూతురుని, కాంగ్రెస్ ని కోడలిని అని కొత్త చుట్టరికమూ చెప్పారు.

కూతురు పుట్టింట్లో తల్లిదండ్రుల పక్షాన ఉంటుంది. కానీ అత్తింటికి రాగానే ఆ ఇంటి గౌరవాన్ని కాపాడుతుంది అని కూడా వివరించారు రేవంత్ రెడ్డి. అంటే తాను ఇపుడు కాంగ్రెస్ గౌరవాన్ని కాపాడే కీలక పాత్రలో ఉన్నాను అని ఆయన చెప్పారు అన్న మాట. అదే టైం లో తాను పుట్టింటి గొప్పలు చెప్పలేను అని కూడా అన్నారు.

ఇక చంద్రబాబు అంటే తనకు ఇష్టం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా అని కూడా మరో డౌట్ వెలిబుచ్చారు. అంటే తన మనసులో బాబు ఉన్నారు అన్నది జగద్విధితం అని రేవంత్ చెప్పేసుకుని ఒప్పేసుకున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ఇన్నాళ్ళూ ఆగి ఇపుడే ఈ మాట అనడం మీదనే చర్చ సాగుతోంది

దీని కంటే కొద్ది రోజుల ముందుకు వెళ్తే నాడు బాబు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. బాబు అరెస్ట్ ని ఎలా చూస్తున్నారు అని మీడియా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే అరెస్ట్ గానే చూస్తున్నాను అని ఆయన చెప్పడం జరిగింది. అంటే తాను ఎక్కువగా రియాక్ట్ కావడంలేదు అన్నట్లుగా బ్యాలాన్స్డ్ గా మాట్లాడారు.

ఆనాటికి టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది అన్న ప్రచారం సాగింది. దాంతో రేవంత్ అలా మాట్లాడారు అని అన్న వారూ ఉన్నారు. ఇక ఇపుడు చూస్తే రేవంత్ రెడ్డి ఓపెన్ అయ్యారని అంటున్నారు. ఇది కూడా వ్యూహమే అని అంటున్నారు. టీడీపీ పోటీలో లేకపోవడం ద్వారా బీయారెస్ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా కాంగ్రెస్ గెలుపు కోసం పాటుపడుతోంది అని ఒక ప్రచారం ఉంది.

అదే విధంగా ఇండైరెక్ట్ గా టీడీపీ క్యాడర్ కి కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలని కోరినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇపుడు రేవంత్ రెడ్డి బాహాటంగా బాబు అంటే ఇష్టం అని చెప్పడం ద్వారా టోటల్ టీడీపీ ఓటు బ్యాంక్ ని డైరెక్ట్ గా తిప్పుకునే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఇది ఎన్నికల్లో వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రకటనగా చూస్తారు కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా ఏమీ ఈ టైం లో రియాక్షన్ వచ్చే చాన్స్ లేదు అని అంటున్నారు. ఈ రోజుకు రేవంత్ ఏమన్నా కూడా కాంగ్రెస్ కి టీడీపీ ప్లస్ అయ్యే సీన్ ఉంటే ఎవరూ ఏమీ అనలేరు కూడా.

అయితే రేపటి రోజున నిజంగా కాంగ్రెస్ గెలిచిన తరువాత అపుడు రేవంత్ రెడ్డికి సీఎం చాన్స్ విషయంలో ఈ కామెంట్స్ ఏమైనా ఇబ్బంది పెడతాయా అన్నదే చూడాల్సి ఉంది. అయితే ముందు కాంగ్రెస్ గెలిస్తే ఆ తరువాత హై కమాండ్ ఎటూ తన గేమ్ తాను స్టార్ట్ చేసి తాను కోరుకున్న వారికే పీఠం అప్పగిస్తుంది. ఆ ఆశతోనే కాంగ్రెస్ సీనియర్లు కూడా ఉన్నారని అంటున్నారు.

ఇదిలా ఉంటే తనకు టీడీపీ పుట్టిల్లు అన్న రేవంత్ రెడ్డి కామెంట్స్ మీద విచిత్రంగా వైసీపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ తో పెళ్ళి చేసినందుకు టీడీపీ ఎన్ని వేల కోట్ల రూపాయల కట్నం ఇచ్చింది అని నిలదీసింది. అలా వచ్చిన డబ్బుతోనే పీసీసీ చీఫ్ పదవిని కొన్నారా అని కూడా ప్రశ్నించింది.

అత్తారింట్లో గొడవ వస్తే మళ్లీ పుట్టింటికి అంటే టీడీపీలోకి వెళ్ళిపోతారా అని కూడా పెద్ద డౌట్ నే ముందు పెట్టింది. ముందు రేవంత్ రెడ్డి ఈ విషయాల మీద క్లారిటీ ఇస్తే కాంగ్రెస్ హై కమాండ్ ఆయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం ఖాయమని కూడా వైసీపీ అంటోంది. మొత్తానికి బీయారెస్ ఈ చాన్స్ వాడుకోవాలి. రేవంత్ రెడ్డిని మాటలతో అటాక్ చేయాలి. వైసీపీ నిలదీస్తోంది. బీయారెస్ ఏమంటుంది అన్నది చూడాలి. అయితే ఎన్నికల టైం, టీడీపీ ఓట్లు బీయారెస్ కి కూడా కీలకం కాబట్టి ఆ పార్టీ వ్యూహాత్కమంగా సైలెంట్ అయింది అని కూడా అంటున్నారు.