Begin typing your search above and press return to search.

పెద్దన్న అంటే .. ఇచ్చింది గుండుసున్నా !

‘బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి 14సార్లు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చాం

By:  Tupaki Desk   |   23 July 2024 3:16 PM GMT
పెద్దన్న అంటే .. ఇచ్చింది గుండుసున్నా !
X

‘బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ ఢిల్లీకి 14సార్లు వెళ్లి వినతిపత్రాలు ఇచ్చాం. ప్రధాని మోదీని మేము పెద్దన్నగా భావించాం. తెలంగాణకు పెద్దన్నగా న్యాయం చేయాలని, నిధులు కేటాయించాలని ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కోరినా ప్రయోజనం లేదు. కేంద్ర బడ్జెట్ లో కనీసం తెలంగాణ అనే పదాన్నే ఉచ్చరించలేదు’ అని తెలంగాణ సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తంచేశాడు.

వికసిత్ భారత్ లో తెలంగాణ భాగం కాదన్నట్లుగా కేంద్రం తీరు ఉంది. బీహార్, ఏపీకి తప్ప ఇతర రాష్ట్రాలకు కేటాయింపులు లేకపోవడం దారుణం. ఓట్లు, సీట్లు మాత్రమే తెలంగాణ నుంచి కావాలి. కానీ తెలంగాణ ఆత్మగౌరవం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని రుజువైంది అని రేవంత్ అన్నారు.

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో యూనియన్ కేబినెట్ మినిస్టర్ గా కిషన్ రెడ్డి తెలంగాణకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహించాలి. తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణలు చెప్పి, తక్షణమే మోదీ మంత్రివర్గం నుంచి కిషన్ రెడ్డి తప్పుకోవాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేయడం విశేషం.

ఏపీకి నిధులు ఎందుకిస్తున్నారని మేము అడగడం లేదు. మాకు ఎందుకు ఇవ్వడం లేదనే అడుగుతున్నాం. గుజరాత్ కు ఎలా నిధులు కేటాయిస్తున్నారో, తెలంగాణకు అలానే ఇవ్వాలి. మూసీ నది అభివృద్ధికి నిధులు ఇవ్వాలని అడిగాం. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంతా బోగస్” అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.