Begin typing your search above and press return to search.

రేవంత్ ప్రెస్ మీట్ .. రఘునందన్ ఫిర్యాదు

కొడంగల్‌లో ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం వివాదం రేపుతున్నది.

By:  Tupaki Desk   |   13 May 2024 3:03 PM GMT
రేవంత్ ప్రెస్ మీట్ .. రఘునందన్ ఫిర్యాదు
X

ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ లో ఓటు వేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టడంపై మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశాడు.

రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని, ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. కొడంగల్‌లో ఓటు వేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం వివాదం రేపుతున్నది.

ఈ మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మండిపడ్డారు. ఓటమిపై భయంతోనే ఆయన నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రచారం చేశారని రఘునందన్ విమర్శించారు.

ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని... గృహనిర్బంధంలో ఉంచాలని రఘునందన్ డిమాండ్ చేశారు.

మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని కొడంగల్‌లో ఓటు వేసిన అనంతరం ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్‌ను పలు ఛానల్స్ ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, ఎన్డీయే పత్తాలేకుండా పోతుందని అన్నాడు. ఆదివారం హెచ్ సీయూలో రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రారంభించడం, ఇండియా పేరున్న టీ షర్ట్ ధరించడం వివాదాస్పదం అయింది.