జీన్ ఫ్యాంట్ లో సీఎం రేవంత్!
రేవంత్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం అన్నట్లుగా లైట్ బ్లూ జీన్, డార్క్ బ్లూ టీ షర్ట్ తో కనిపించారు.
By: Tupaki Desk | 12 Jan 2024 5:58 AM GMTప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ యంగ్ పొలిటీషియన్సే ముఖ్యమంత్రులుగా ఉన్నారు! ఈ క్రమంలో జగన్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, మెయింటినెన్స్ ఏ రేంజ్ లో ఉంటాయనే సంగతి కాసేపు పక్కనపెడితే... కొత్తగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తాజాగా జీన్ ఫ్యాంట్ - టీ షర్ట్ తో కనిపించారు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
సీఎంగా లేని సమయంలో రేవంత్ రెడ్డి ఎక్కువగా బ్లాక్ ఫ్యాంట్, వైట్ షర్ట్, బ్లాక్ షూస్ .. మరికొన్ని సార్లు చాలా సింపుల్ గా రెగ్యులర్ జీన్స్, టీషర్ట్స్ తోనూ కనిపించేవారు. దీంతో చాలా సందర్భాల్లో రేవంత్ ని చూస్తే పెద్ద పొలిటీషియన్ అనే భావన కంటే.. మనకు బాగా తెలిసిన వ్యక్తి, మనలాంటి సామాన్య వ్యక్తి అనే భావన కనిపిసుందనే కామెంట్లు అప్పట్లో బలంగా వినిపించేవి.
ఫలితాంగా, ప్రధానంగా యూత్ .. రేవంత్ ని విపరీతంగా ఫాలో అయ్యేవారు. సమస్యలపై స్పందించేటప్పుడు ఎంత హుందాగా, ఎంత అగ్రసివ్ గా ప్రసంగాలు, పోరాటాలు చేసేవారో.. యూత్ తో భేటీ అయ్యేటప్పుడు అంత సింపుల్ లుక్ లో కనిపిస్తూ ప్రధానంగా యువతరానికి ఐకాన్ గా ఉండేందుకు రేవంత్ ఇష్టపడుతున్నట్లు కనిపించేవారు.
కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. అయినప్పటికీ.. ఆయనలో సింపుల్ సిటీ మారలేదని.. సీఎం అయ్యాను కాబట్టి కాస్త మెయింట్ నెన్స్ మార్చాలనే ఆలోచన రాలేదని.. మొన్న ఎమ్మెల్యే, నిన్న ఎంపీ, నేడూ సీఎం... పదవి ఏదైనా, బాధ్యత మరేదైనా తన సింప్లిసిటీలో మార్పు ఉండదన్నట్లుగా చెప్పకనే చెప్పే ఒక సన్నివేశం తాజాగా కనిపించింది.
ఇందులో భాగంగా సీఎం అయిన తర్వాత కూడా రేవంత్ ఒక మీటింగ్ లో సింపుల్ లుక్ లో కనిపించారు. ఇందులో భాగంగా... లైట్ బ్లూ జీన్, డార్క్ బ్లూ టీ షర్ట్ తో కనిపించారు. తెలంగాణలో యూత్ ని మరింతగా అట్రాక్ట్ చేస్తూ.. తాను ఏ హోదాలో ఉన్నా సింపుల్ గానే ఉంటాననే సంకేతాలు ఇచ్చారు. దీంతో... తానేమీ ప్రజలకు అందనంత ఎత్తులో ఉన్నట్లుగా భావించడం లేదని, తానలో మార్పు లేదని చెప్పకనే చెప్పినట్లయ్యిందని తెలుస్తుంది.
ఈ సింపుల్ & యంగ్ లుక్ తో మరోసారి రేవంత్ కనిపించింది గూగుల్ వైఎస్ ప్రెసిడెంట్ తో మీటింగ్ సందర్హంగా కావడం గమనార్హం. అవును... ఐటీ అడ్డాకు మారిన, మరింతగా మారుతున్న హైదరబాద్ లో ఇప్పుడున్న టెంపోను కంటిన్యూ చేస్తూ, మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట.. సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట.. ముఖ్యమంత్రితో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయండనికి సంసిద్ధతను వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తుతం కాలంలో అత్యంత వైరల్ ఇష్యూ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆవశ్యకతను, అందుకు గూగుల్ వద్ద ఉన్న సాంకేతికతను సీఎం కు వివరించారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... ప్రస్తుత ప్రపంచంలో దాదాపు ప్రతీ రంగాన్ని ఏఐ ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో... వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాలలో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ అజెండాను అభివృద్ధి చేయడంలో భావస్వాములు కావడానికి గూగుల్ ఆసక్తిని చూపిస్తున్న విషయాన్ని వెల్లడించారని తెలుస్తుంది.
ఇదే సమయంలో... తెలంగాణ పౌరుల అవసరాలను తీర్చడానికి నాణ్యమైన సేవలను అందించడానికి లోతైన సాంకేతికత, నైపుణ్యం తమతో ఉందని చంద్రశేఖర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవివరంగా వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ ఫారంలను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రత మెరుగుదలలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు.
ఈ సమావేశంలో పలువురు గూగుల్ ప్రతినిధులతోపాటు మంత్రులు డి.శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు! ఈ మీటింగ్ లో పాల్గొన్న సందర్భంగా రేవంత్ అవుట్ ఫిట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం అయినా కూడా యంగ్ లుక్ లో చాలా సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!