Begin typing your search above and press return to search.

రేవంత్ కు పోలీసుల సమన్లు.. మే 1న ఏమి జరగబోతుంది?

ఇప్పటికే ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శలూ, తీవ్ర విమర్శలతో వాతావరణం వేడెక్కిపొతున్న నేపథ్యంలో.. మరింత హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది

By:  Tupaki Desk   |   29 April 2024 10:19 AM GMT
రేవంత్ కు పోలీసుల సమన్లు.. మే 1న ఏమి జరగబోతుంది?
X

లోక్‌ సభ ఎన్నికల వేళ తీవ్ర ఆసక్తికరమైన విషయం చోటు చేసుకుంది. ఇప్పటికే ఎన్నికల వేళ నేతల మధ్య విమర్శలూ, తీవ్ర విమర్శలతో వాతావరణం వేడెక్కిపొతున్న నేపథ్యంలో.. మరింత హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నుంచి సమన్లు జారీ చేయబడ్డాయి. దీంతో ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు! అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించిన కేసులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమందికీ సమన్లు ఇచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా.. మే 1 న విచారణకు రావాలని ఆ సమన్లలో పేర్కొన్నట్లు చెబుతున్నారు. రిజర్వేషన్స్ అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ రచ్చ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రధాని మోడీ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు.

కాగా... కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు సంబంధించిన ఒక వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలో అమిత్ షా మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి సంచలన కామెంట్స్‌ చేసినట్లుగా ఉంది. దీంతో.. హోం మంత్రిత్వ శాఖ, భారతీయ జనతా పార్టీలు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు!

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీచేశారు! ఈ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్‌ షా మాట్లాడినట్టుగా ఉంది! అయితే... ఈ విషయంపై స్పందించిన బీజేపీ నేతలు... అసలు వీడియోలో తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయడంపై ఏమీ మాట్లాడలేదని అంటున్నారు.