Begin typing your search above and press return to search.

గురుశిష్యుల పదం బ్యాన్.. రేవంత్ అండ్ కో సీరియస్

సాదాసీదాగా కనిపించే మాటలు.. తర్వాతి రోజుల్లో చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

By:  Tupaki Desk   |   4 July 2024 10:55 AM GMT
గురుశిష్యుల పదం బ్యాన్.. రేవంత్ అండ్ కో సీరియస్
X

సాదాసీదాగా కనిపించే మాటలు.. తర్వాతి రోజుల్లో చేసే డ్యామేజ్ అంతా ఇంతా కాదు. పెద్దగా పట్టించుకోకుండా ఉంటాం కానీ కాలక్రమంలో అవే సమస్యలుగా మారుతుంటాయి. ఈ విషయాన్ని గుర్తించే కొందరు రాజకీయ అధినేతలు ప్రత్యర్థులు ఉపయోగించే పదాలను.. వ్యాఖ్యలపైనా సీరియస్ అవుతుంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎదురవుతోంది. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఏదో ఒక అంశంలో చంద్రబాబు ప్రస్తావన తేవటం.. ఆయన్ను గురువుగా.. రేవంత్ ను శిష్యుడిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది.

చంద్రబాబు అన్నంతనే తెలంగాణలో ఆయన మీద కొందరికి ఉన్న వ్యతిరేకత సంగతి తెలిసిందే. దాన్నిరాజకీయంగా వాడి.. రేవంత్ ను ఇరుకున పడేసేలా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న రేవంత్.. గురుశిష్యుల మాట ఎవరి నోటి నుంచి వచ్చినా కస్సుమంటున్న పరిస్థితి. రేవంత్ కున్న ఇబ్బందిని గుర్తించిన ఆయన రాజకీయ ప్రత్యర్థులు.. ఏదో ఒక రూపంలో ‘గురు శిష్యులు’ పదాన్ని ప్రస్తావిస్తూ చిరాకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొన్నిసందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం అ చాటున ఆ పదాన్ని వాడుతున్నారు. ఇదే అంశం పలుమార్లు చర్చకు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ అండ్ కో తాజాగా సీరియస్ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. అయినోళ్లు కానీ పరాయివాళ్లు కానీ.. ఎవరైనా సరే.. ఎంతటి సన్నిహితులైనా సరే.. సీరియస్ గా కాకున్నా సరదాగా అయినా సరే.. గురుశిష్యులు అన్న పదాన్ని వాడితే మాత్రం వారి లెక్క తేల్చాల్సిందే. వారికి సీరియస్ వార్నింగ్ ఇవ్వాల్సిందేనని డిసైడ్ అయినట్లుగా చెబుతున్నారు.

కొన్ని మీడియా సంస్థల్లోనూ గురుశిష్యుల పదాన్ని వాడుతున్న వైనాన్ని సీరియస్ గా తీసుకున్న రేవంత్ అండ్ వారికి ద్రష్టికికూడా తమ అభ్యంతరాల్ని తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై కొన్ని మీడియా సంస్థలు రివ్యూ చేసుకొని.. రేవంత్ వర్గం నుంచి వచ్చిన సూచన అర్థవంతమైనదిగా భావించినట్లు తెలిసిందే. ఇకపై తాము కూడా ఆ పదాన్ని వాడమన్న హామీని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ.. ఎవరైనా రాజకీయ దురుద్దేశంతో గురుశిష్యుల పదాన్ని వాడితే వారిపై చర్యలకు వీలుగా నిర్ణయం తీసుకున్నట్లుగా మారుతోంది. మొత్తంగా.. గురుశిష్యుల మాటకు పరిమితులు విధించటంతో పాటు.. ఎవరైనా దాన్ని ఉపయోగిస్తే.. దాని వెనుకున్న ఉద్దేశంపై మదింపు జరపాలన్న ఆలోచనలో రేవంత్ అండ్ కో ఉన్నట్లుగా తెలుస్తోంది.