Begin typing your search above and press return to search.

అమెరికా టూర్ తో రేవంత్ కొత్త టాలెంట్ బయటకొచ్చిందట

అలా.. కేటీఆర్ ను తరచూ గుర్తు చేసుకోవటం ద్వారా రేవంత్ సర్కారులోని లోపాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   8 Aug 2024 5:09 AM GMT
అమెరికా టూర్ తో రేవంత్ కొత్త టాలెంట్ బయటకొచ్చిందట
X

అవును.. గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు కావటం.. కేసీఆర్ సర్కారు స్థానే.. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చినప్పుడు ఒక అంశం మీద తీవ్రమైన చర్చ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా కేటీఆర్ తన సత్తా చాటారని.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే విషయంలో ఆయన కీలక భూమిక పోషించారని.. ఆయన ప్రభుత్వంలోని లోటు తీర్చలేనిదని.. ఐటీని మరో స్థాయికి తీసుకెళ్లటంలో ఆయన కీ రోల్ ప్లే చేసినట్లుగా వ్యాఖ్యలు వినిపించాయి. ఇందుకు తగ్గట్లే.. సోషల్ మీడియాలోనూ చర్చ జరిగింది.

మరికొందరైతే ఒక అడుగు ముందుకేసి.. ప్రాశ్చాత్య దేశాల్లో మాదిరి.. ఐటీ మంత్రిగా టాలెంట్ ఉన్న కేటీఆర్ కు ఆ శాఖను పార్టీలకు అతీతంగా అప్పగిస్తే ఎంత బాగుండన్న తీరని కలను ఆవిష్కరించి ఆశ్చర్యపరిచారు. ప్రాశ్చాత్య దేశాల్లో మాదిరి జరగాలని కోరుకునే వారు.. మన దేశంలోని రాజకీయ అంశాలు.. పార్టీల తీరు.. ప్రజాసేవ విషయంలో నేతల ఆలోచన ధోరణి ఎలా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

అలా.. కేటీఆర్ ను తరచూ గుర్తు చేసుకోవటం ద్వారా రేవంత్ సర్కారులోని లోపాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఒక హాట్ టాపిక్ గా మార్చారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ ను బీట్ చేసే వారు. . రీప్లేస్ చేసే వారే లేరన్న ప్రచారం ఈ మధ్యన ఎక్కువైంది. అయితే.. ఆ వాదనలో పస లేదన్న మాటను తన చేతలతో చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజాగా జరుగుతున్నవిదేశీ పర్యటనలో ఈ విషయాన్ని మరింత స్పష్టత ఇస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకోవటంతో పాటు.. కేటీఆర్ లేని లోటును తీర్చేలా వ్యవహరిస్తున్న రేవంత్ తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ అయితే రేవంత్ సర్కారుతో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. హైదరాబాద్ లో మరో భారీ క్యాంపస్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇలా పలు కంపెనీలతో డీల్స్ ను ఓకే చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇదంతా చూస్తున్న వారంతా మాజీ మంత్రి కేటీఆర్ ను రీప్లేస్ చేసే మొనగాడు ముఖ్యమంత్రి రేవంత్ లో ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణకు సంబంధించి కేటీఆర్ లోటు గురించి మాట్లాడే వారికి.. సీఎం రేవంత్ రూపంలో సమాధానం వచ్చేసినట్లేనని చెబుతున్నారు. ఈ కొత్త ఇమేజ్ ను తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతకాలం కాపాడుకుంటారో చూడాలి.