రేవంత్ వర్సెస్ కేటీఆర్... మధ్యలో కరెంట్ బిల్!
గతంలో రెండు సార్లూ ప్రతిపక్షాలు కాస్త వీక్ గా ఉండటంతో వార్ వన్ సైడ్ అయ్యినట్లు కనిపించింది కానీ
By: Tupaki Desk | 20 Jan 2024 12:30 PM GMTతెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ రాజకీయం వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లూ ప్రతిపక్షాలు కాస్త వీక్ గా ఉండటంతో వార్ వన్ సైడ్ అయ్యినట్లు కనిపించింది కానీ... ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా బలంగా ఉండటంతో... రసవత్తర రాజకీయానికి తెలంగాణలో తెరలేచింది! ఈ సమయంలో అధికార కాంగ్రెస్, బీఆరెస్స్ ల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరుతుంది. ఈ సమయంలో కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ఒక సూచన చేశారు.
అవును... బీఆరెస్స్ పార్టీని వంద మీటర్ల లోతులో బొంద పెడతామంటూ లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇదే సమయంలో... మాజీ సీఎం కేసీఆర్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ.. పులి బయటకు వస్తే, బోనులో బంధిస్తామంటూ హెచ్చరించారు! దీంతో ఈ వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్స్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు.
లండన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆరెస్స్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. తాజాగా... లోక్ సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో సమావేశమయిన ఆయన... శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతోపాటు రాబోయే లోక్ సభ ఎన్నికల కార్యాచరణపైనా చర్చించారు. ఈ క్రమంలో... నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించారు.
ఈ సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కేటీఆర్. ఇందులో భాగంగా... బీఆరెస్స్ ను 100 మీటర్ల లోపల పాతిపెట్టడం కాదు.. ముందు 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలను నెరవేర్చండి అని సూచించారు. ఇదే సమయంలో... తన ప్రస్థానంలో రేవంత్ వంటివారిని ఎంతోమందిని బీఆరెస్స్ చూసిందని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఒక పిలుపునిచ్చారు కేటీఆర్. ఇందులో భాగంగా... జనవరి నెల కరెంటు బిల్లులను ప్రజలెవరూ చెల్లించవద్దని.. కరెంటు బిల్లులను 10 - జన్ పథ్ లోని సోనియా గాంధీ ఇంటికి పంపాలని తెలిపారు. ఇదే క్రమంలో... ప్రతి మహిళకు నెలకు రూ.2,500 హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని.. ఆ హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదని అన్నారు.