Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు సినిమా స్టైలో వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్

తనకు తాను ఫిరాయింపుల్ని ప్రోత్సహించనని స్పష్టం చేసిన రేవంత్.. ప్రజాతీర్పునకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని.. ఆ వాతావరణాన్ని చెడగొట్టరని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 4:28 AM GMT
కేసీఆర్ కు సినిమా స్టైలో వార్నింగ్ ఇచ్చిన సీఎం రేవంత్
X

ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటలు చాలా జాగ్రత్తలతో ఉంటాయి. అందుకు భిన్నంగా ఫ్రీగా.. ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లుగా లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడటం అన్నది కత్తి మీద సాము. అందులోకి తలపండిన సీనియర్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సమాధానాలు ఇవ్వటం అంత తేలికైన పని కాదు. అయినప్పటికీ అస్సలు తగ్గని రేవంత్.. తాను చెప్పాలనుకున్నది చెప్పేయటం ఆసక్తికరంగా మారింది.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రేవంత్ కీలక వ్యాఖ్యలుచేశారు. ఎలాంటి శాస్త్రీయత లేకుండా కొత్త జిల్లాల ఏర్పాటు ఉందని.. కొన్నిచోట్ల అతి తక్కువ జనాభా ఉంటే.. కొన్ని జిల్లాల్లో భారీగా జనాభా ఉండటంతో పాటు.. పలు ఇతర అంశాల్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో కొత్త జిల్లాలను కంటిన్యూ చేస్తారా? డిస్ కనెక్టు చేస్తారా? అన్న ప్రశ్నకు రేవంత్ చాలా క్లారిటీతో బదులిచ్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు.. అశాస్త్రీయంగా.. ఎలాంటి కసరత్తు లేకుండా పూర్తి చేశారని.. అందుకు భిన్నంగా తాము కొత్త జిల్లాలపై కమిషనన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

అసెంబ్లీలో ఈ అంశాన్ని చర్చిస్తామని.. కమిషన్ కు ఛైర్మన్ గా సుప్రీంకోర్టు.. హైకోర్టు మాజీ న్యాయమూర్తితో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాల విభజనతో పాటు.. మండలాలు.. రెవెన్యూ డివిజన్లను కూడా అడ్డగోలుగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. పాలనా పరమైన మార్పులకు వెనక్కి తగ్గేది లేదని.. పాలనలో తనదైన ముద్ర కోసం రేవంత్ ఎంతలా తపిస్తున్నారన్న విషయం ఆయనమాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

ఈ సందర్భంగా పార్టీకి బొటాబొటి మెజార్టీ మాత్రమే ఉంది కదా? ఈ సందర్భంగా ఏదైనా తేడా జరిగితే.. ఎమ్మెల్యేలు అటుఇటు మార్పు వస్తే పరిస్థితేంటి? అని ప్రశ్నించిన వేళ.. రేవంత్ తనదైన స్టైల్లో బదులిచ్చారు. తనకు తాను ఫిరాయింపుల్ని ప్రోత్సహించనని స్పష్టం చేసిన రేవంత్.. ప్రజాతీర్పునకు కేసీఆర్ కట్టుబడి ఉంటారని.. ఆ వాతావరణాన్ని చెడగొట్టరని ఆశిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అందుకు భిన్నంగా పిరాయింపులతో రంగస్థలం సిద్ధం చేస్తే తెగబడటమేనంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు. 'వాళ్లు గేమ్ మొదలు పెడితే.. నేను తగ్గేదే ఉండదు' అని చెప్పిన రేవంత్.. తాను మాత్రం ఫిరాయింపుల్ని ప్రోత్సహించనని చెప్పారు. "నేనను ఫౌల్ గేమ్ మొదలు పెట్టను. తప్పుడు పనులను ప్రోత్సహించను. ఒకవేళ వాళ్లు గేమ్ మొదలు పెట్టారనుకో.. రేసులో పరిగెత్తటం అనేది ఇక స్టార్ట్ అయితది కదా ఎవరికైనా. ఫిరాయింపుల వంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారి తీస్తదో ఎవరూ ఊహించలేరు. నేనైతే జానారెడ్డిని మాత్రం కాను. అంతవరకు మీకు తెలుసు. ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. బాధ్యత ఇచ్చారు. అందరూ దానికి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఒకవేళ తెగబడటం మొదలుపెడితే .. నేనైతే ఎక్కడా తగ్గేదే ఉండదు" అంటూ క్లారిటీగా తాను చెప్పాల్సింది చెప్పేశారు రేవంత్. ఆయన మాటలు విన్నప్పుడు.. ఫిరాయింపులకు తెగబడితే.. తానేం చేయాలన్న దానిపై ఫుల్ క్లారిటీతో సీఎం రేవంత్ ఉన్నారన్న విషయం తన మాటలతో చెప్పేశారని చెప్పాలి.