సీఎం పోస్ట్ మీద రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్...!
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికైనా మోజే. అది రాజకీయాల్లో పరమ పధ సోపానం అని చెప్పాలి. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ప్రతీ వారూ సీఎం సీటు కోసమే చూస్తారు.
By: Tupaki Desk | 20 Nov 2023 3:28 AM GMTముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికైనా మోజే. అది రాజకీయాల్లో పరమ పధ సోపానం అని చెప్పాలి. రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ప్రతీ వారూ సీఎం సీటు కోసమే చూస్తారు. దానికే గురి పెడతారు. అలాంటిది సీఎం పోస్ట్ మీద తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు
తనకు సీఎం పదవి మీద ఆశ అత్యాశ అయితే లేదు అని తేల్చేశారు తాను తెలంగాణాకు ఎప్పటికైనా సీం అవుతాను అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడం విశేషం. తనకు ఈ రోజే పదవి కావాలని అయితే లేదు అన్నారు. సీఎం గా కాంగ్రెస్ అధినాయకత్వం ఎవరిని నియమించినా తాను హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ చాలా విలువైనది అని అంటున్నారు.
నిజానికి చాలా మంది ఆలోచనలు రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. ఆయన వచ్చిన తరువాతనే కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. యువకుడు రాజకీయంగా దూకుడు స్వభావం ఉన్న నేత, కేసీయార్ అంటే ఏ మాత్రం వెరపు బెదురూ లేకుండా అలుపెరగని పోరాటం చేసిన వారుగా రేవంత్ రెడ్డికి గుర్తింపు ఉంది.
అందువల్ల ఆయన సీఎం పోస్ట్ కి కచ్చితంగా పోటీ పడే మొదటి వారుగా ఉంటారు అని అంతా అంటారు. పీసీసీ చీఫ్ సీఎం కావడం కూడా సహజమైన విషయం. అలాంటిది రేవంత్ రెడ్డి మాత్రం ఒక ఇంటర్వ్యూలో సీఎం పోస్టు గురించి తన ఆశల గురించి చెబుతూ కీలకమైన కామెంట్స్ చేశారు.
సీఎం పదవిలో ఎవరిని నియమించినా తాను పార్టీకి కట్టుబడి ఉంటాను అని రేవంత్ రెడ్డి చెప్పడం మాత్రం సెన్సేషనల్ డెసిషన్ అంటున్నారు. సీఎం ఎవరు అన్న దాంట్లో హై కమాండ్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతే కాదు తనకు సీఎం పదవి చేపట్టేందుకు అవసరం అయిన వయసు ఓపికా రెండూ నిండుగా ఉన్నాయని కొడా అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు తాను సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ష్యూరిటీగా ఉంటామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఏఐసీసీ ఆమోదంతోనే ఈ ఆరు హామీలు ప్రకటించామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సీఎం పదవి విషయంలో తనకు అత్యాశలు లేవు అని రేవంత్ రెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ లోపలా బయటా ఏ రకమైన పరిణామాలకు దారి తీస్తుంది అన్న చర్చ కూడా మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అంటూ కొందరు కాంగ్రెస్ అభ్యర్ధులు అయితే అపుడే ప్రచారం చేస్తున్నారు.
అదే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వం మీద మోజు ఉన్న యువ ఓటర్లు ఉన్నారు అని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీగానే చూసి ఓట్లేసీ జనాభావే ఎక్కువగా ఉంటుంది. జాతీయ పార్టీలకు ఓటేసే ముందు జనాలు హై కమాండ్ డెసిషన్ అని కూడా ఆలోచించే ఓటేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ చూసినపుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వ్యూహాత్మకంగా కూడా ఉంది అని అంటున్నారు.
అది ఆయనకు రాజకీయంగా లాభించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఇన్నింగ్స్ అన్నవి కొన్నేళ్ల క్రితం స్టార్ట్ అయ్యాయి. అవి ఇప్పట్లో ఆగిపోయేవి కావు. ఆయనే చెప్పినట్లుగా మరో రెండు దశాబ్దాల పాటు చురుకైన రాజకీయాన్ని చేయగలరు. కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం మెటీరియల్ అనడంతో సందేహం లేదు ఇక ఆయన రేపు అయినా సీఎం కావచ్చు. వెయిట్ చేసి కొన్నాళ్ళ తరువాత అయినా కావచ్చు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.