Begin typing your search above and press return to search.

మూడు నెలల జైలు శిక్ష... ఆర్జీవీ రియాక్షన్ ఇదే!

సుమారు గత ఏడేళ్లుగా విచారణ జరుపుతున్న వ్యవహారంపై అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.

By:  Tupaki Desk   |   23 Jan 2025 10:15 AM GMT
మూడు నెలల జైలు శిక్ష... ఆర్జీవీ రియాక్షన్  ఇదే!
X

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఓ షాకింగ్ విషయం బ్రేకింగ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. సుమారు గత ఏడేళ్లుగా విచారణ జరుపుతున్న వ్యవహారంపై అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.

ఈ తీర్పు వినిపించే సమయంలో నిందితుడు గైర్హాజరైనందుకు అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, సంబంధిత పోలీస్ స్టేషన్ ద్వారా అరెస్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నెగోషియబుల్ ఇనిస్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ - 138 ప్రకారం ఆర్జీవీకి శిక్ష పడిందని అంటుననరు. ఈ సమయంలో ఆర్జీవీ స్పందించారు.

అవును... చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆర్జీవీ స్పందించారు. దీనిపై వివరణ ఇస్తాను అంటూ... ఇది తన మాజీ ఉద్యోగి కి రూ.2.38 లక్షలకు సంబంధించిన 7 ఏళ్ల నాటి కేసు అని.. దీనిపై తన లాయర్లు హాజరవుతారని తెలిపారు.

ఇదే సమయంలో... ప్రస్తుతం విషయం కోర్టులో ఉన్నందున తాను ఈ వ్యవహారంపై ఇంతకు మించి ఏమీ చెప్పలేనని ఎక్స్ వేదికగా స్పందించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

కాగా... తాజాగా ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించిన కోర్టు.. మూడు నెలల్లోగా ఫిర్యాదు దారుడికి రూ.3,72,219 నష్టపరిహారం చెల్లించాలని.. చెల్లించడంలో విఫలమైతే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా... మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది.

ఇదే సమయంలో... విచారణ సమయంలో కస్టడీలో ఎక్కువ సమయం గడపనందున.. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని సెక్షన్ 428 ప్రకారం వర్మ శిక్ష తగ్గింపును పొందలేరని మేజిస్ట్రేట్ వైపీ పూజారి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా పై విధంగా స్పందించారు ఆర్జీవీ.