ప్రయోజనం ఆగిపోతే విశ్వాసం కూడా... ఆర్జీవీ కామెంట్ పీక్స్!
మరికొన్ని ట్వీట్లు ఎవరిని ఉద్దేశించిపెట్టారనేది తెలిసినా చెప్పలేని విధంగానూ ఉంటుంటుంది అని అంటారు.
By: Tupaki Desk | 8 Jan 2024 6:59 AM GMTఅటు సినిమా ఇండస్ట్రీ, ఇటు రాజకీయాలు.. రెండింటిలోనూ నిత్యం తనదైన శైలితో హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు దర్శకుడు రాం గోపాల్ వర్మ. ఈ క్రమంలో ఆయన చేసే ట్వీట్లు నిత్యం మీడియాలో చర్చనీయాంశం అవుతుంటాయి. అందులో కొన్ని ఫేస్ టూ ఫేస్ డైరెక్ట్ అటాక్ గా ఉంటే.. మరికొన్ని మాత్రం అత్యంత లోతుగా ఆలోచిస్తే తప్ప అర్ధం కావు అన్నట్లుగా ఉంటాయి. మరికొన్ని ట్వీట్లు ఎవరిని ఉద్దేశించిపెట్టారనేది తెలిసినా చెప్పలేని విధంగానూ ఉంటుంటుంది అని అంటారు.
ఈ క్రమంలో రాజకీయాలపై ఆర్జీవీ అత్యంత అరుదైన ట్వీట్ ఒకటి చేశారు. ఈ సందర్భంగా అన్ని రాజకీయాల వెనుక ఉన్న సింగిల్ లైన్ స్టోరీ ఇదే అంటూ ఒక పాయింట్ పేర్కొన్నారు. ఇప్పుడు ఇది అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ ప్రజలను - ప్రభుత్వాలనూ ఉద్దేశించి చేశారా.. లేక, నాయకులతో పార్టీలకు ఉండే సంబంధాలను ప్రస్థావిస్తూ పేర్కొన్నారా అనేది ఇక్కడ అత్యంత ఆసక్తిగా మారింది.
"వర్షం ఆగిపోయిన తర్వాత అంతవరకూ రక్షణగా నిలిచిన గొడుగు కూడా భారంగా మారుతుంది. అలాగే ప్రయోజనాలు ఆగిపోతే విశ్వాసం కూడా అంతమవుతుంది" ఇది ఆర్జీవీ రాజకీయాల వెనుక ఉందని చెప్పిన సింగిల్ లైన్ స్టోరీ! ఈ ట్వీట్ ను సరిగ్గా పరిశీలిస్తే... జగన్ టిక్కెట్ ఇవ్వలేదనే కారణంతో ఇంతకాలం కాపాడిన, గతంలో టిక్కెట్ ఇచ్చి గెలిపించుకున్న వైసీపీని విడిచి బయటకు వెళ్లిపోతున్న నేతలను ఉద్దేశించి చేసిఉంటారని అంటున్నారు పరిశీలకులు.
ఇదే సమయంలో... తాజాగా ఇంత లోతైన ట్వీట్ తర్వాత మరో సెటైరికల్ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ఇందులో నేరుగా... "పొలిటిక్స్ లో సింహమే సింగిల్ గా వస్తుంది.. పందులు గుంపుగా వస్తాయి.. విశ్వధాబిరామ వినుర చంద్రమా!" అని చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు రాం గోపాల్ వర్మ.