Begin typing your search above and press return to search.

ఆర్జీవీ తలకు కోటి వెల కట్టారు...ఎవరిదీ వ్యూహం...!?

ఎన్నికల సీజన్ వస్తే చాలు ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి వరసబెట్టి సినిమాలు అలా ప్రోడ్యూస్ అయి బయటకు వస్తాయి.

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:31 PM GMT
ఆర్జీవీ తలకు కోటి వెల కట్టారు...ఎవరిదీ వ్యూహం...!?
X

టాలీవుడ్ లో వివాదాస్ప డైరెక్ట్ గా ఆర్జీవీ అలియాస్ రాం గోపాల్ వర్మ పేరు టాప్ లో ఉంటుంది. ఆయన ఎపుడూ మీడియాలో సోషల్ మీడియాలోనే ఉంటారు. ఆయన కేరాఫ్ వివాదం అని చెప్పాలి. ఆయన సినిమాలలో కంటే రాజకీయాల్లో నలుగుతారు. ఎన్నికల సీజన్ వస్తే చాలు ఆర్జీవీ ఫ్యాక్టరీ నుంచి వరసబెట్టి సినిమాలు అలా ప్రోడ్యూస్ అయి బయటకు వస్తాయి.

ఆయన మూవీస్ సెటైరికల్ గా ఉండవు. డైరెక్ట్ గానే పేర్లు పెట్టి రియలస్టిక్ గా తీయడమే ఆర్జీవీ టాలెంట్. ప్రజెంట్ పొలిటికల్ పార్టీలలో ఉన్న నాయకులను అచ్చు గుద్దిన వారినే తెచ్చి ఆయా పాత్రలకు ఎంపిక చేయడం నుంచి తనదైన పొలిటికల్ మసాలాను దట్టించి మూవీకి ఫుల్ ఆఫ్ కాంట్రవర్సరీగా డిజైన్ చేయడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా.

ఇదిలా ఉంటే ఆర్జీవీ ప్రెజెంట్ వ్యూహం పేరుతో ఒక సినిమా తీశారు. అది నవంబర్ 10న రిలీజ్ కావాల్సి ఉంది. కోర్టు వివాదాలలో చిక్కుకుంది. ఇటీవల ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్జీవీ విజయవాడలో నిర్వహించారు. ఈ నెల 29న మూవీ రిలీజ్ అనుకుంటే దాని మీద టీడీపీ నేత నారా లోకేష్ కోర్టులో కేసు వేశారు. దాంతో విచారణ దశలో ఉంది. ఈ నెల 28కి ఈ కేసు వాయిదా పడింది. ఇదిలా ఉంటే ఆర్జీవీ ఆఫీసు వద్ద సోమవారం రాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు వెళ్లి నిరసన తెలియచేశారు.

ఈ సందర్భంగా ఆయనను నానా దుర్భాషలు ఆడుతూ దిష్టిబొమ్మను తగులబెట్టారు. దీని మీద ఆర్జీవీ తరఫున స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఎఫ్ ఐ ఆర్ కట్టారు కూడా. ఆ సంగతి అలా ఉంటే వ్యూహం మూవీ మీద టీవీ చానళ్ళలో డిబేట్ కూడా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక టీవీ చానల్ లో నిర్వహించిన డిబేట్ లో అమరావతి ఉద్యమ నేత అయిన కొలికపూడి శ్రీనివాసరావు రాం గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు.

ఈ సందర్భంగా యాంకర్ అలాంటి మాటలు వద్దు మీరు విత్ డ్రా చేసుకోండి మీ మాటలు అని చెప్పినా శ్రీనివాసరావు వినిపించుకోలేదు. ఐ రిపీట్ అని పదే పదే ప్రకటించారు. అంతే కాదు తనకు సమాజం కంటే కూడా ఏదీ ఎక్కువ కాదు అని అన్నారు. దీంతో ఇది మరింత వివాదం అయి కూర్చుంది. ఇదిలా ఉంటే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలనే తన ఫిర్యాదుగా అధికారికంగా తీసుకోవావలని ఆ వీడియో బైట్ ని ట్యాగ్ చేసి మరీ ఆర్జీవీ ఏపీ పోలీసులకు పంపించడం విశేషం.

మొత్తం మీద చూస్తే వ్యూహం సినిమాలో ఏముందో ఎవరికీ తెలియదు కానీ అది పెద్ద రచ్చగా మారింది. పోనీ వర్మ ఇలాంటి సినిమాలు ఫస్ట్ టైం తీస్తున్నారా అంటే ఆయన గతంలోనూ తీశారు లక్ష్మీస్ ఎన్టీయార్ అని ఒక సినిమా తీశారు. అలాగే కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని సినిమా తీశారు. పవన్ కళ్యాణ్ మీద కూడా ఆ మధ్య ఇంకో సినిమా తీశారు.

వాటి మీద కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. కానీ ఇపుడు ఫస్ట్ టైం వ్యూహం విషయంలో అర్జీవీ మూవీని ఇబ్బంది పెడుతున్నంతగా గతంలో ఏవీ లేవు. పోనీ ఆయా సినిమాల ఇంపాక్ట్ ఏమైనా ఉందా అవేమైనా బ్లాక్ బస్టర్లు అయ్యాయా అంటే లేవు అనే చెప్పాలి. మరి ఎందుకు ఇంతలా చేస్తున్నారు అంటే ఎన్నికల వ్యూహంలో ఇది కూడా భాగమేనా అని చర్చ వస్తోంది. మొత్తానికి ఆర్జీవీ హాట్ హాట్ గా ఉండే ఏపీ ఎన్నికల్లో తల పెట్టేశారు అని అంటున్నారు.