Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణాలపై జగన్ కామెంట్స్... ఆర్జీవీ రియాక్షన్ ఇదే!

అవును... తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసి అందరి అటెన్షన్ తనవైపుకు తిప్పుకున్నారనే కామెంట్ సంపాదించుకున్నారు ఆర్జీవీ.

By:  Tupaki Desk   |   13 Oct 2023 4:43 PM GMT
పవన్  కళ్యాణాలపై జగన్  కామెంట్స్... ఆర్జీవీ రియాక్షన్  ఇదే!
X

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ పరిచయం అవసరం లేని దర్శకుల్లో రాం గోపాల్ వర్మ ఒకరని అన్నా అతిశయోక్తి కాదేమో. ఇక్కడ శివ అన్నా.. అక్కడ సర్కార్ అన్నా... అది ఆర్జీవీ మార్కు మేకింగ్. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో సమకాలీన సామాజిక, రాజకీయ అంశాలపై కాస్త ఎక్కువగానే స్పందిస్తున్నట్లు కనిపించిన ఆర్జీవీ తాజాగా వైఎస్ జగన్ కామెంట్స్ పైనా తనదైన శైలిలో స్పందించారు.

అవును... తాజాగా వ్యూహం సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసి అందరి అటెన్షన్ తనవైపుకు తిప్పుకున్నారనే కామెంట్ సంపాదించుకున్నారు ఆర్జీవీ. రెండు నిమిషాల 20 సెకన్లు ఉన్న వ్యూహం ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగిందనే చెప్పాలి. వైఎస్సార్ మరణానంతరం జరిగిన పరిణామాలపై కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఈ ట్రైలర్ పై అసక్తి కలుగుతుందని అనడంలో సందేహం లేదనే అనుకోవాలి.

సోనియా గాంధీ పాత్ర ఫోన్ కాల్ మాట్లాడటంతో "వ్యూహం" ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అందులో... జగన్ పాత్ర చేస్తున్న "ఓదార్పు యాత్ర" ఆపేయాలని వార్నింగ్ ఇవ్వడం.. అనంతరం చంద్రబాబు పాత్ర తెరపై కనిపించి, ఇప్పుడు మన "వ్యూహం" మొదలవుతుంది అని చెప్పడం ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి. నెక్స్ట్... జగన్ పాత్ర పాదయాత్ర చేయడం, సీబీఐ ఎంక్వైరీ, జగన్ భార్య పాత్ర సంక్షేమ పథకాల గురించి చెప్పడం వంటి సీన్లు చూపించారు ఆర్జీవీ.

ఇదే సమయంలో పవన్ పాత్ర ను కూడా పరిచయం చేసిన ఆర్జీవీ... ఆ కల్యాణ్‌ కు ఎవరు శత్రువో.. ఎవరు మిత్రుడో గుర్తించే తెలివి లేదయ్యా అంటా చంద్రబాబు పాత్రతో చెప్పించారు. ఇదే సమయంలో ఊహించని విధంగా... స్కిల్ డెవలెప్ మెంట్ స్కాం ప్రస్తావన కూడా ఈ ట్రైలర్ లో రావడం గమనార్హం.

ఆ ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు ఆర్జీవీ. ఈ సందర్భంగా తాజాగా సామర్లకోట సభలో పవన్ పెళ్లిల్లపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్న ఎదుర్కొన్నారు. దీంతో... పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళపై ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు ఆర్జీవీ.

ఇందులో భాగంగా... "జగన్ అనినదానిలో తప్పేముంది.. నాకు సరిగా డిటైల్స్ తెలియదు కానీ... ఫస్ట్ భార్య తెలుగు, తర్వాత హిందీ, ఆతర్వాత ఫారిన్ లాంగ్వేజ్ అమ్మాయి. అందులో పర్సనల్ ఏముంది. పవన్ వైఫ్స్ గురించి అలా డిస్రైబ్ చేశారు" అని అన్నారు. దీంతో జగన్ వ్యాఖ్యలతో పాటు ఆర్జీవీ రియాక్షన్ కూడా వైరల్ అవుతుంది!