కొహ్లీ అంపైర్ కి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్న కార్ల కంపెనీ!
అవును... కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, 42వ ఓవర్ వేయడానికి బంగ్లా బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు
By: Tupaki Desk | 20 Oct 2023 9:33 AM GMTవరల్డ్ కప్ లో భాగంగా గురువారం జరిగిన ఇండియా – బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఆటంతా ఒకెత్తు, విరాట్ సెంచరీ మరొకెత్తు, అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ఫెర్మార్మెన్స్ మరొకెత్తు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా భారత్ విక్టరీ.. కేఎల్ రాహుల్, జడేజాల బెస్ట్ క్యాచెస్, కోహ్లీ సెంచరీ లను రిచర్డ్ కెటిల్ బరో సైడ్ చేసేశారు. ప్రస్తుతం ఆయన పేరే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవును... కోహ్లీ 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా, 42వ ఓవర్ వేయడానికి బంగ్లా బౌలర్ నాసుమ్ అహ్మద్ వచ్చాడు. అతను కోహ్లీ లెగ్ సైడ్ బంతిని వేశాడు. అది కొహ్లీ కాళ్ల వెనుక నుంచి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఇలా కావాలనే వైడ్ డెలివరీ వేశాడని భావించిన కోహ్లీ... నాసుమ్ అహ్మద్ వైపు సీరియస్ గా చూస్తూ చికాకు పడిగా... అంపైర్ దాన్ని వైడ్ ఇవ్వకుండా షాకిచ్చాడు.
దీంతో... ఇప్పుడు కొహ్లీ సెంచరీకి పరోక్షంగా అంపైర్ సాయం చేశాడని కొందరంటుంటే... అది వైడ్ ఇచ్చినా ఇంకా ఒక రన్ కొట్టాలి.. అప్పుడు సిక్స్ కొట్టినా సరిపోయేది కదా అని సమర్ధిస్తున్నారు. ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపించని ఇలాంటి తప్పిదాలు జరుగుతుండటం అత్యంత సహజం అని అంటున్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సమయంలో మరికొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో ని ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కార్ల కంపెనీ మోరిస్ గ్యారేజెస్ (ఎంజీ) తనదైన శైలిలో వెటకారం ఆడింది. ఇందులో భాగంగా సదరు అంపైర్ కు తమ ఎంజీ కారును బహుమతిగా ఇవ్వగలమో లేమో అని ఫైనాన్స్ వాళ్లతో చర్చిస్తున్నాం అంటూ వ్యంగంగా ట్వీట్ చేసింది.