Begin typing your search above and press return to search.

దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఈమె.. టాప్ 10 లిస్ట్ ఇదే!

అవును... తాజాగా 2024 హూరున్ ఇండియా సంపన్నుల జాబితాలో.. అత్యంత మహిళా సంపన్నురాలిగా రాధా వెంబు నిలిచారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 4:30 PM GMT
దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ఈమె.. టాప్ 10 లిస్ట్  ఇదే!
X

హురున్ ఇండియా రిచ్ లిస్ట్ - 2024 లో టాప్ 10 సెల్ఫ్ మేడ్ ఉమన్ వివరాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... "జోహో" కో ఫౌండర్ రాధా వెంబు రూ.47,500 కోట్లతో ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచారు. ఈమె తర్వాతి స్థానాల్లో "నైకా"కు చెందిన ఫల్గుణి నాయర్ రూ.32,200.. "అరిస్టా నెట్ వర్క్స్" కు చెందిన జయశ్రీ ఉల్లాల్ రూ.32,100 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

అవును... తాజాగా 2024 హూరున్ ఇండియా సంపన్నుల జాబితాలో.. అత్యంత మహిళా సంపన్నురాలిగా రాధా వెంబు నిలిచారు. ఈమె... క్లౌడ్ ఆధారిత సాఫ్ట్ వేర్, టెక్, ఇంటర్నెట్ వెబ్ సంబంధిత సాధనాలను ఉత్పత్తి చేసే కంపెనీ హోహో కార్ప్ ను కలిగి ఉన్నారు. ఈమె 1996లో సోదరుడితో కలిపి దీన్ని ప్రారంభించారు. ఈ కంపెనీలో రాధా వెంబు 50శాతం వాటాను కలిగి ఉన్నారు.

ఈమె మద్రాస్ ఐఐటీలో చదివారు. ఈ సమయంలో... భారత్ లో అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇదే సమయంలో కళ్లజోడు రిటైల్ కంపెనీ లెన్స్ కార్ట్ కో ఫౌండర్ నేహా బన్సల్ రూ.3,100 కోట్లతో ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న అత్యంత పిన్న వయసున్న మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు.

అదేవిధంగా... నైట్ రైడర్స్ సహ యజమానిగా ఉన్న జూహ్లీ చావ్లా రూ.4,600 కోట్లతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళగా రికార్డ్ సృష్టించారు.

ఇక మిగిలినవారిలో ఫాల్గుణి నాయర్ భారతదేశంలోని బ్యూటీ రిటైల్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఈమె రూ.32,000 కోట్ల నికర విలువతో విజయవంతమైన నైకాను ప్రముఖ ఆన్ లైన్ బ్యూటీ ఫ్లాట్ ఫామ్ గా మార్చారు.

ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచిన అరిస్టా నెట్ వర్క్స్ సీఈవో జయశ్రీ ఉల్లాల్ ఈ జాబితాలో ఉన్న మరో ప్రముఖ మహిళా పారిశ్రామితవేత్త. ఈమె రూ.32,100 కోట్ల నికర విలువతో అరిస్టా నెట్ వర్క్స్ క్లౌడ్ నెట్ వర్కింగ్ సొల్యూషన్స్ లో ప్రముఖ ప్రొవైడర్ గా అవతరించారు.

ఇక ఈ జాబితాలో బయోకాన్ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ మజుందార్ షా... నాలుగో స్థానంలో నిలిచారు. బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీలో ఈమె గణనీయమైన కృషి చేశారు. ఈమె నికర ఆస్తుల విలువ రూ.29,000 కోట్లుగా ఉంది.

ఇక ప్రముఖ డేటా స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన కాన్ ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నార్ఖేడ్ & ఫ్యామిలీ సాంకేతిక రంగంలో విశేషమైన విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలో రూ.4,900 కోట్లతో ఆమె ఈ జాబితాలో ఐదోస్థానంలో నిలిచారు.

టాప్-10 భారతీయ సంపన్న మహిళల జాబితా!:

రాధా వెంబు (జోహో) - రూ.47,500 కోట్లు

ఫాల్గుణీ నాయర్ & ఫ్యామిలీ (నైకా) - రూ.32,200 కోట్లు

జయశ్రీ ఉల్లాల్ (అరిస్టా నెట్ వర్క్) - రూ.32,100 కోట్లు

కిరణ్ ముజుందార్ షా (బయోకాన్) - రూ.29,000 కోట్లు

నేహా నార్ఖేడ్ & ఫ్యామిలీ (కాన్ ఫ్లుయెంట్) - రూ.4,900 కోట్లు

జూహీ చావ్లా & ఫ్యామిలీ (నైట్ రైడర్స్ స్పోర్ట్స్) - రూ.4,600 కోట్లు

ఇంద్రా కే నూయి (పెప్సీ కో) - రూ.3,900 కోట్లు

నేహా బన్సాల్ (లెన్స్ కార్ట్) - రూ.3,100 కోట్లు

దేవితా రాజ్ కుమార్ సరాఫ్ (వీయూ టెక్నాలజీస్) - రూ.3,000 కోట్లు

కవితా సుబ్రమణ్యన్ (అప్ స్టాక్స్) - రూ.2,700 కోట్లు