Begin typing your search above and press return to search.

కాషాయ బుక్ ఎందుకు...ఈడీ ఐటీ సీబీఐ ఉండగా !

ఏమిటో తెలుగు రాజకీయాల్లో కొత్త పొలిటికల్ సిలబస్ సరికొత్త పొలిటికల్ బుక్స్ వచ్చేశాయి. అవి ప్రజల కోసం తామేదే చేస్తామని చెప్పే డెవలప్మెంట్ బుక్స్ కావు. అవి రివెంజ్ పాలిటిక్స్ కి తెర తీసే బుక్స్.

By:  Tupaki Desk   |   20 Feb 2025 10:33 AM GMT
కాషాయ బుక్ ఎందుకు...ఈడీ ఐటీ సీబీఐ ఉండగా !
X

ఏమిటో తెలుగు రాజకీయాల్లో కొత్త పొలిటికల్ సిలబస్ సరికొత్త పొలిటికల్ బుక్స్ వచ్చేశాయి. అవి ప్రజల కోసం తామేదే చేస్తామని చెప్పే డెవలప్మెంట్ బుక్స్ కావు. అవి రివెంజ్ పాలిటిక్స్ కి తెర తీసే బుక్స్. ప్రతీ రాజకీయ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతుంది. వారు అధికార పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ఒక దశలో హద్దు దాటి కూడా వెళ్తారు.

దాంతో ప్రభుత్వం అడ్డు కట్ట వేస్తుంది. ఆ పని చేసేది అధికారులూ పోలీసులే. అయితే ఇవి కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ కి దారి తీస్తాయి. దాంతో వారిని ఇపుడు విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అయిదేళ్ళు మాత్రమే పార్టీ ప్రభుత్వాలు ఉంటాయని కానీ ముప్పయి అయిదేళ్ళ పాటు ఐఏఎస్ ఐపీఎస్ లు బాధ్యతలలో ఉంటారని వారు తప్పులు చేస్తే కనుక తాము బుక్స్ లో రాసుకుని అధికారంలోకి వచ్చాక ఇంతకు ఇంతా చెల్లిస్తామని సీరియస్ గానే వార్నింగ్ ఇస్తున్నారు.

అసలు ఈ బుక్ కల్చర్ ఏంటి ఎందుకు వచ్చింది అంటే ఏపీలో వైసీపీ అయిదేళ్ళ పాలనలో అరాచకత్వం ఉందని టీడీపీ ఆరోపిస్తూ నిరసనలు చేసేది. ఇక యువగళం పాదయాత్రలో నారా లోకేష్ అయితే ఏకంగా రెడ్ బుక్ ని ప్రకటించి సంచలనం రేపారు. వైసీపీ నేతల అక్రమాలు అవినీతి మీద తాము రెడ్ బుక్ ఓపెన్ చేసి అందరి చిట్టాను రాసుకుంటున్నామని అధికారంలోకి వచ్చిన వెంటేనే ఒక్కొకరి విషయం తేలుస్తామని ఆనాడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది.

ఇలా రెడ్ బుక్ పాపులర్ కావడంతో తెలంగాణాలోనూ బుక్ కల్చర్ పాకింది. అక్కడ విపక్షంలో ఉన్న బీఆర్ ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో తమను పెడుతున్న ఇబ్బందులు అలాగే అవినీతి అరాచకాలు చేసే వారి మీద పింక్ బుక్ ని ఓపెన్ చేయబోతున్నామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ మహిళా నాయకురాలు కవిత పేర్కొంటూ కాంగ్రెస్ కి పింక్ బుక్ తో జవాబు చెబుతామని హెచ్చరించారు.

ఇక బీజేపీ వంతు అన్నట్లుగా ఆ పార్టీ నాయకుడు, ఎంపీ అయిన ఈటెల రాజేందర్ తాము కాంగ్రెస్ హయాంలో అరాచకాల మీద కాషాయం బుక్ ని ఓపెన్ చేస్తామని ప్రకటించారు. ఇది కూడా ఇపుడు వైరల్ అవుతోంది. బీజేపీ ఆరెంజ్ బుక్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో ఈటెల వివరిస్తూ అధికారులు తప్పు చేస్తున్నారని వారి మీద చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పాలనలో తప్పిదాలు చేసిన వారి మీద కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని వెల్లడించారు

ఇవన్నీ పక్కన పెడితే గత పదేళ్ళుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ వద్ద ఈడీ ఐటీ సీబీఐ అని అత్యంత బలమైన వ్యవస్థలు ఉన్నాయి. వాటిని తమ ప్రత్యర్థుల మీద బీజేపీ ప్రయోగిస్తుందని ఇప్పటికే విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. బీజేపీ డబుల్ ఇంజర్ సర్కార్ అంటూంటారు. కానీ బీజేపీ ప్రత్యర్ధులు మాత్రం ఈ మూడు వ్యవస్థలను చూపించి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అని సెటైర్లు వేస్తారు.

బీజేపీ అత్యంత బలంగా కేంద్రంలో ఉంది. తలచుకోవాలి కానీ ట్రిపుల్ ఇంజన్ తో ప్రత్యర్థుల మీద పడడం ఖాయమని చెబుతారు. అలా జరిగిన సంఘటనలనూ గుర్తు చేసుకుంటారు. ఇక ఈటెల రాజెనదర్ చెబుతున్నట్లుగా కాషయాం బుక్ ఒకటి ఓపెన్ చేయడం ఎందుకు దానిలో పేర్లు రాసుకుని తాము ఎపుడో అధికారంలోకి వచ్చాక యాక్షన్ తీసుకోవడం ఏందుకు అన్నది కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ గా వస్తున్నాయి.

తెలంగాణాలో కాంగ్రెస్ సర్కార్ ఉన్నా దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. బీజేపీ తలచుకుంటే తన దగ్గర ఉన్న పదునైన వ్యవస్థలను ముందు పెట్టి కొరడా ఝలిపించవచ్చు కదా అని కూడా సెటైరికల్ గా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు మిగిలిన పార్టీలకు అయితే అధికారం ఉండాలి, కానీ ట్రిపుల్ ఇంజన్ నే తన దగ్గర ఉంచుకున్న బీజేపీకి ఏమి కావాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదో పొలిటికల్ గా అందరిలాగానే తామూ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుని ఈటెల వంటి వారు ఆరెంజ్ బుక్ అంటున్నారు తప్పించి బీజేపీకి మండితే ఈ బుక్కులతో పనేముందని కూడా హాట్ కామెంట్స్ చేసే వారూ ఉన్నారు.

నిజానికి ఈ పొలిటికల్ బుక్స్ తో జనాలకు సంబంధం లేదు, ఇవన్నీ రివెంజ్ కోసం ఆయా పార్టీలు ఏర్పాటు చేసుకునే బుక్స్. అయితే తెలుగునాట ఈ న్యూ పొలిటికల్ సిలబస్ కే వాల్యూ ఎక్కువగా ఉంది. అంతే కాదు ఇవే జనాల్లోకి పోతున్నాయి. అందుకే ఈటెల కూడా మాకూ ఒక బుక్ ఉంది, అడ్డంగా బుక్ చేస్తామని అంటున్నారని కామెంట్స్ పడుతున్నాయి. ఏది ఏమైనా బీజేపీ ఆరెంజ్ బుక్ ప్రకటనతో ఈటెల ట్రిపుల్ ఇంజన్ ని గుర్తు చేసారని కూడా సెటైర్లు పడుతున్నాయి.