Begin typing your search above and press return to search.

'మతం కాదు పార్టీ ప్రమాదంలో ఉంది'... బాలీవుడ్ హీరో కీలక వ్యాఖ్యలు!

ఈ సమయంలో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

By:  Tupaki Desk   |   11 Nov 2024 1:01 PM GMT
మతం కాదు పార్టీ ప్రమాదంలో ఉంది...  బాలీవుడ్  హీరో కీలక వ్యాఖ్యలు!
X

నవంబర్ 20న ఒకే విడతలో 288 మంది ఎమ్మెల్యే స్థానాలు కలిగిన మాహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జగరనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతల ప్రచారాలతో దేశ ఆర్థిక రాజధాని ఉన్న రాష్ట్రం హోరెత్తి పోతోంది. ఈ సమయంలో బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ ముఖ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు!

అవును... అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ క్రమంలో... లాతూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్న తన సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధీరజ్ దేశ్ ముఖ్ తరుపున బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్ ముఖ్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... కొంతమంది తమ మతం ప్రమాదంలో ఉందని చెబుతున్నారని.. అయితే.. అక్కడ ప్రమాదంలో ఉన్నది వారి పారేనే కానీ, మతం కాదని పేర్కొన్నారు. అందుకే తమ పార్టీని రక్షించమని ప్రజలను కోరుతున్నరని.. అలాంటి వారికి ముందుగా అభివృద్ధి గురించి మాట్లాడాలని ప్రజలు తెలియజేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా... ప్రస్తుత (బీజేపీ నేతృత్వంలోని కూటమి) ప్రభుత్వ పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని.. అవి కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంద్ని అన్నారు. చిత్తశుద్ధితో పని చెయని వారు మాత్రమే మతం గురించి మాట్లాడతారని.. వాస్తవానికి మనం పని చేసి, ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలేయాలని అన్నారు.

ఇదే సమయంలో... పనిచేయని వాళ్లు రక్షణగా మతాన్ని ఎంచుకుంటారని.. నిజాయితీగా పనిచేసే వాళ్లవైపు ధర్మం ఉంటుందని అన్నారు. ఈ సమయంలో ఎవరైనా మతం అంటూ వస్తే వారిని ముందుగా పంటలకు మద్దతు ధర, మహిళలకు రక్షణపై ప్రశ్నించాలని ప్రజలకు సూచించారు.

ఈ సందర్భంగా తన సోదరుడు ధీరజ్ దేశ్ ముఖ్ ను గత అసెంబ్లీ ఎన్నికల్లో 1.21 లక్షల మెజారిటీతో గెలిపించారని, ఈ ఎన్నికల్లోనూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన రితేశ్... ప్రధానంగా యువత పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.