Begin typing your search above and press return to search.

మారిన రూల్‌: పెళ్ల‌యిన జంట‌కే 'ఓయో' రూమ్‌లు!

కానీ, ఓయో వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి వారికి ఆయా బ‌డ్జెట్ హోట‌ళ్లు.. కేంద్రాలుగా మారాయ‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 7:30 PM GMT
మారిన రూల్‌: పెళ్ల‌యిన జంట‌కే ఓయో రూమ్‌లు!
X

మ‌ర‌క ప‌డ‌డం తేలికే.. కానీ, ఆ మ‌ర‌కను చెరుపుకోవ‌డ‌మే క‌ష్టం. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా బ‌డ్జెట్ హోట ళ్ల జాబితాలో పేరొందిన `ఓయో`పై కూడా ఇదే మ‌ర‌క ప‌డింది. ఓయో హోట‌ళ్లు అంటే.. ప్రేమికుల‌కు అడ్డాగా మారిపోయాయ‌న్న ప్ర‌చారం తెర‌మీదికి వ‌చ్చింది. గ‌తంలో ప్రేమికులు, వివాహేత‌ర బంధం కొన‌సాగించాల‌ని అనుకునేవారు.. ఏదో ఒక చోట క‌లుసుకునేవారు. కానీ, ఓయో వ‌చ్చిన త‌ర్వాత ఇలాంటి వారికి ఆయా బ‌డ్జెట్ హోట‌ళ్లు.. కేంద్రాలుగా మారాయ‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.

త‌క్కువ ధ‌ర‌కే రూమ్ ల‌భించ‌డంతోపాటు.. సెక్యూరిటీ ప‌ర్ప‌స్‌గా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోవ‌డంతో ప్రేమికులు.. వివాహేత‌ర సంబంధం ఉన్న‌వారు.. ఓయోను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో ఓయో హోట‌ల్ అంటే.. డిగ్నిఫైడ్ ఫ్యామిలీలు, అధికారులు జంకే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ విష‌యంపై అనేక ఆరోప‌ణ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. దీంతో ఓయో బ్రాండ్ పైనే మ‌ర‌క‌లు ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనిని గ‌మ‌నించి న ఓయే అధినేత రితేష్ అగ‌ర్వాల్‌.. రూల్స్‌ను మార్చేశారు. ఓయే బ్రాండ్‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఈ క్ర‌మంలో ఓయో హోట‌ళ్ల‌లో గ‌దుల‌ను కేవ‌లం వివాహమైన జంట‌ల‌కే కేటాయించాల‌ని.. సెక్యూరిటీ ప‌ర్ప‌స్ కూడా పెంచాల‌ని నిర్ణ‌యించారు. దీనిలో భాగంగా.. మ‌న దేశంలోనే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా.. కొన్ని నిబంధ‌న‌ల‌ను మార్చ‌డంతోపాటు.. సిబ్బంది విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ము ఖ్యంగా ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఉన్న న‌గ‌రాల్లో ఓయో రూమ్ బుక్ చేయాలంటే.. గ‌తంలో ఉన్నంత తేలికైతే కాద‌ని ఇప్పుడు మారిన ప‌రిస్థితుల‌ను బ‌ట్టి తెలుస్తోంది.

దేశంలో ఎప్ప‌టి నుంచంటే!

ప్ర‌పంచ వ్యాప్తంగా.. ప‌ర్యాట‌క న‌గ‌రాలు, కేంద్రాల్లో ఓయో ఆతిథ్య హోట‌ళ్ల‌కు ప్ర‌శిద్ధి. త‌క్కువ బ‌డ్జెట్‌లో విలాస‌వంత‌మైన సౌక‌ర్యాల‌తో ఇవి ల‌భిస్తున్నారు. ఆయా ప్ర‌భుత్వాలు కూడా.. ప‌ర్యాట‌కాన్ని విస్త‌రించుకో వాల‌న్న ఉద్దేశంతో ఓయో విష‌యంలో కొన్ని స‌డ‌లింపులు కూడా ఇచ్చాయి. కానీ, రాను రాను.. ఓయో హోట‌ళ్లు `బూతు` బంగ‌ళాలుగా మారుతున్నాయ‌న్న విమ‌ర్శ‌లు, కామెంట్లు , క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో అలెర్ట‌యిన యాజ‌మాన్యం.. ప‌ద్ధ‌తిని మార్చుకుంది.

ఇక‌, మ‌న దేశానికి వ‌స్తే.. 2013లో ఇక్క‌డ తొలి ఓయో హోట‌ల్ ఏర్పాటైంది. అతిథుల‌కు త‌క్కువ ఖ‌ర్చు తో వివిధ బడ్జెట్‌లకు అనుగుణంగా ప‌లు రకాల సేవలను అందిస్తోంది.దీంతో అన‌తి కాలంలో ప‌ర్యాట‌కుల‌కు చేరువైంది. అయితే.. అంతే వేగంగా చెడ్డ పేరు తెచ్చుకుంది. మ‌న ద‌గ్గ‌ర యూపీ, మ‌హారాష్ట్ర‌ల్లో ప‌ర్యాట‌కులు.. ఓయో రూమ్‌ల‌ను వ్య‌క్తిగ‌త `అవ‌స‌రాల‌`కు వినియోగించుకుంటున్న‌ట్టు పెద్ద ఎత్తున దుమారం రేగింది. దీంతో ఇప్పుడు నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌తరం చేస్తూ.. ఓయో నిర్ణ‌యం తీసుకుంది.