Begin typing your search above and press return to search.

జగన్ పెళ్లి రోజు ఆర్కే రోజా ఆ క్లారిటీ ఇచ్చేసినట్లేనా?

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ నేతలు, ప్రధానంగా మాజీ మంత్రుల నుంచి పెద్దగా సౌండ్ రావడం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   28 Aug 2024 11:43 AM GMT
జగన్ పెళ్లి రోజు ఆర్కే రోజా ఆ క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
X

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ నేతలు, ప్రధానంగా మాజీ మంత్రుల నుంచి పెద్దగా సౌండ్ రావడం లేదనే చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో.. వైసీపీలోని పలువురు కీలక నేతలు, గత ప్రభుత్వ హాయాంలో మంత్రులుగా ఉన్న వారు పార్టీలు మారుతున్నట్లు ప్రచారం జరిగింది.

ఈ సమయంలో రోజా పేరు కూడా పార్టీ మారేవాళ్ల జాబితాలో ప్రధానంగా కనిపించింది. అయితే ఈ ప్రచారంపై రోజా ఎలాంటి వివరణా ఇవ్వలేదు. దీంతో.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఆమె లైట్ తీసుకున్నారని ఒకరంటే... లేదు ఏకంగా పార్టీ మారిన తర్వాత మారిన సోషల్ మీడియా స్టేటస్ తో కన్ఫాం చేస్తారని మరికొంతమంది కామెంట్ చేశారు.

అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఓ పోస్ట్ తో... ఆమె పార్టీ మారడం లేదనే స్పష్టత ఇచ్చారని అంటున్నారు నెటిజన్లు. వైఎస్ జగన్ - భారతీలను అన్నా, వదిన అని సంభోదిస్తూ తాజాగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ రోజా ట్వీట్ చేయడమే దీనికి కారణం. దీంతో పార్టీ మార్పుపై రోజా క్లారిటీ ఇచ్చినట్లే అని అంటున్నారు.

అవును... వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ - భారతి దంపతుల పెళ్లి రోజు ఇవాళ. 1996 ఆగస్టు 28న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది! ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, వైసీపీ శ్రేణులూ జగన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... "ఏళ్లనీ గడిచినా చెదరని మీ అనుబంధం.. ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ...!! అన్నా వదినలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు" అంటూ మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జగన్ - భారతి ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా... రోజా వైసీపీని వీడబోతున్నారని.. ఈ సందర్భంగా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ స్థాపించిన కొత్త పార్టీ "తమిళగ వెట్రి కళగం" లో జాయిన్ అవ్వబోతున్నారని.. 2026లో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని తెగ ప్రచారం జరిగింది.

ఆయితే... తాజాగా వైసీపీ అధినేత జగన్ - భారతి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా రోజా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పడం, అన్నా వదినా అని సంభోదించడంతో.. ఆమె పార్టీ మార్పుపై జరుగుతున్నదంతా అసత్య ప్రచారమనే కామెంట్లు తాజాగా మొదలయ్యాయి!