ఇచ్చారు.. చెప్పుకోలేరు.. బీజేపీలో కృష్ణ భజన .. !
కొన్ని కొన్ని విషయాలపై రాజకీయ పార్టీలు చేసుకునే ప్రచారం అంతా ఇంతా కాదు. తాము ఏం చేసినా.. ప్రచారం మాత్రం విభిన్నంగా చేసుకుంటారు.
By: Tupaki Desk | 24 Dec 2024 7:00 AM GMTకొన్ని కొన్ని విషయాలపై రాజకీయ పార్టీలు చేసుకునే ప్రచారం అంతా ఇంతా కాదు. తాము ఏం చేసినా.. ప్రచారం మాత్రం విభిన్నంగా చేసుకుంటారు. చిన్న పనే అయినా.. పెద్ద ప్రచారానికి తెరదీస్తారు. ఈ విషయంలో పార్టీల అధిష్టానాల నుంచి క్షేత్రస్థాయి నాయకుల వరకుకూడా.. ఒకే మాట అన్నట్టుగా ఉంటారు. అయితే.. ఇప్పుడు ఏపీలో బీజేపీ మాత్రం ఏమీ చెప్పుకోలేని.. ప్రచారం చేసుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదే.. బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్య వ్యవహారం.
బీసీ కోటాలో బీజేపీ పెద్దలు.. ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపించారు. ఇది ఒకరకంగా.. బీజేపీకి ప్లస్. ఏపీలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పించే విషయం కూడా. బీసీ లను బీజేపీవైపు ఆకర్షించేందుకు ఈ నియామకం.. తారక మంత్రంగా పనిచేస్తుందని అందరూ భావించా రు. కానీ, ఏ ఒక్కరూ కూడా.. దీనిని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకునే ప్రయత్నం కూడా చేయలే దు. కారణాలు ఏవైనా.. ఇది పార్టీకి మైనస్ అవుతోంది.
వాస్తవానికి బీసీ కోటాలో కృష్ణయ్యకు పదవి ఇవ్వడాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు. అలాగని స్వాగతించడ మూ లేదు. ఇదే పార్టీలో ఈ వ్యవహారంపై చర్చలేకుండా చేసింది. దీనికి ప్రధాన కారణం.. కృష్ణయ్యకు.. రాష్ట్ర బీజేపీ నాయకులతో సాన్నిహిత్యం లేక పోవడం. పైగా అధిష్టానంతోనే ఆయన నేరుగా సంప్రదింపు లు జరిపి.. ఈ పదవిని తెచ్చుకున్నారన్న చర్చ కూడా ఉంది. అయితే.. బీజేపీ అధిష్టానం లెక్క వేరేగా ఉంది. ఏపీలోనూ.. తెలంగాణలోనూ.. బీసీల కేంద్రంగా రాజకీయాలు చేయాలన్నది వారి ఉద్దేశం.
ఈ నేపథ్యంలోనే ఎంతో మంది లైన్‌లో ఉన్నా..చివరకు పవన్ కల్యాణే.. పదవి కోరుకున్నా.. వదిలేందుకు ఇష్టపడలేదు. దీని వెనుక ఉన్న మర్మం అంతా.. బీసీ ఓటు బ్యాంకు కోసమే. అయినా.. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నాయకులు లైట్ తీసుకున్నారు. ఈ పరిణామం పార్టీకి ఎలా ఉన్నా.. అధిష్టానం పెద్దలకు రుచించడం లేదు. తాము ఇంత చేస్తే.. కనీసం ప్రచారం చేసుకోవడంలో వెనుకబడుతున్నారన్నది వారి వాదనగా ఉంది.
అసలు రాష్ట్రంలో నేతల మధ్యకలివిడి లేకపోవడం కూడా.. చర్చకు వచ్చింది. అయినా.. ఎవరూ మాట్లాడకపోవడం.. కృష్ణయ్య వ్యవహారం.. అత్యంత గోప్యంగా జరిగిపోవడం చూస్తే.. పరిస్తితి సీరియస్‌గానే ఉందని అంటున్నారు సీనియర్లు. మరి ఏం చేస్తారో చూడాలి.